NTV Telugu Site icon

Anushka: మిస్ శెట్టి ప్రమోషన్స్ లోకి ప్రభాస్ ను లాగిన అనుష్క

Anushka Prabhas

Anushka Prabhas

Anushka Shetty Shares Her Favourite Recipe and Challenges Prabhas: ఎట్టకేలకు అనుష్క శెట్టి తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అసలు విషయం ఏమిటంటే అనుష్క శెట్టి హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిని తనను తల్లయ్యేందుకు సహాయం చేయమని కోరినట్లుగా ట్రైలర్ లో చూపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగబోతున్నట్లుగా చెబుతున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అంటే ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు అనుష్క శెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో నేరుగా పాల్గొన్నది లేదు. నవీన్ పోలిశెట్టి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలియతిరిగారు, నిన్న ప్రెస్ మీట్ పెట్టి సినిమా ఖచ్చితంగా చూసి తమను ఆశీర్వదించమని కోరాడు. తర్వాత మెగాస్టార్ చిరంజీవికి సినిమా చూపించడం ఆయన అద్భుతంగా ఉందని తన రివ్యూ ఇవ్వడం కూడా జరిగిపోయాయి.

Tiger Nageswara Rao : ఏక్ దమ్ ఏక్ దమ్ అంటున్న టైగర్..

ఇక ఇప్పుడు ఆయన అమెరికాలో సినిమాను ప్రమోట్ చేసేందుకు అక్కడికి బయలుదేర బోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనుష్క శెట్టి ఎట్టకేలకు ఈ సినిమా ప్రమోషన్స్ రంగంలోకి దిగింది. ఆమె ఈ సినిమాలో ఒక షెఫ్ పాత్రలో కనిపించడంతో తాను తనకు నచ్చిన ఒక ఫేవరెట్ ఫుడ్ రెసిపీ షేర్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసురుతున్నానని అది కూడా ప్రభాస్ కే ఈ చాలెంజ్ విసురుతున్నానని చెప్పుకొచ్చింది. ఆయన ఫుడ్ అంటే చాలా ఇష్టపడతాడని ఫుడ్ ఇతరులకు తినిపించాలని కూడా అంతే ఇష్టపడతాడని అందుకే ఆయనను ట్యాగ్ చేసి ఈ ఛాలెంజ్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగా మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు నీర్ దోశ ఎలా చేయాలి అని ఆమె రెసిపీ షేర్ చేసింది. ప్రభాస్ ను కూడా తనకు నచ్చిన ఫుడ్ కి సంబంధించిన రెసిపీ షేర్ చేయమని ఛాలెంజ్ చేసింది.