NTV Telugu Site icon

Anushka: నవ్వి నవ్వి ఏడుస్తారు… టిష్యూస్ తెచ్చుకోండి… మాములుగా ఉండదు

Anushka Shetty

Anushka Shetty

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో యూత్ ని జానేజిగర్ గా మారిపోయాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. మోస్ట్ ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో, లేడీ సూపర్ స్టార్ గా పేరున్న స్వీట్ బ్యూటీ అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యువీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్‌గా, అనుష్క చెఫ్‌గా నటిస్తున్నారు. ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఫీల్ గుడ్ సినిమాని పి.మహేష్‌ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసారు. చాలా రోజులుగా ఆగుతూ వస్తున్న ఈ సినిమాకి ఎట్టకేలకు మోక్షం కల్పిస్తూ ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

“Keep your tissues ready, cos you’re about to cry with 𝙇𝙖𝙪𝙜𝙝𝙩𝙚𝙧.  Meet #MissShettyMrPolishetty in theatres from 𝘼𝙐𝙂𝙐𝙎𝙏 4𝙩𝙝!” అంటూ యువీ క్రియేషన్స్ నుంచి ట్వీట్ వచ్చింది. ఆగస్టు రెండో వారంలో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ఇదే టైమ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ‘జైలర్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ రెండు సినిమాలకి వారం ముందే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా రిలీజ్ అవుతుంది అంటే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి, థియేటర్స్ ని నిలబెట్టుకోవడానికి అనుష్క, నవీన్ పోలిశెట్టి దగ్గర ఉన్నది వారం సమయం మాత్రమే. ఈ వారం గ్యాప్ లోనే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” సినిమా సత్తా చాటాల్సి ఉంది.

Show comments