Anushka Shetty: అనుష్క అభినయంలోని మహత్తు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka Shetty:అందం, అభినయం కలబోసిన రూపంతో ఎందరో తారలు అలరించారు. వారిలో తాను ప్రత్యేకం అంటూ అనుష్క శెట్టి మురిపించారు. పొడుగైన సుందరీమణులు ఎంత అందంగా ఉన్నా, అంతగా అలరించలేరని సినీజనం అంటూ ఉంటారు. వారి మాటను కొట్టి పారేస్తూ అనుష్క ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉండడం విశేషం. అనుష్క ఓ చిత్రంలో నాయికగా నటించింది అనగానే సదరు చిత్రం కోసం పరుగులు తీసేవారు జనం. ‘అరుంధతి’ గా అదరహో అనిపించిన అనుష్క అభినయం, తరువాత ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ ఎంతగానో మురిపించారామె. దాంతో అనుష్క అరుదైన అభినేత్రిగా జనం మదిలో నిలచారు. అందువల్లే ‘సైరా…నరసింహారెడ్డి’ కథ ఆమె పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అనుష్క ఏ చిత్రంలోనూ నటించక పోయినా, ఇంతకు ముందు ఆమె నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆనందిస్తున్నారు. అదీ అనుష్క అభినయంలోని మహత్తు!
అనుష్క శెట్టి 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఇంట్లో ‘స్వీటీ శెట్టి’గా ఆమె సాగారు. చిత్రసీమకు వచ్చాకే అనుష్కగా మారారు. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో బ్యాచ్ లర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో పట్టా పొందిన అనుష్క తరువాత యోగసాధనతో మెరుపు తీగెలా మారారు. కొన్నాళ్ళు యోగా పంతులమ్మగానూ పనిచేశారు. ఈ పొడుగాటి సుందరి అందం పూరి జగన్నాథ్ ను పట్టేసింది. దాంతో ‘సూపర్’ చిత్రంతో తెరకు పరిచయం చేశారు పూరి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా, అనుష్క అందం మాత్రం జనానికి బంధం వేసింది. నాగార్జున కుటుంబంతో అనుబంధం పెంచుకున్న అనుష్క, వారి ఇంట్లో అమ్మాయిలా ‘స్వీటీ’గానే అభిమానం సంపాదించారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, చిరంజీవి అందరి సరసనా చిందేసి కనువిందు చేశారు అనుష్క. తరువాతి తరం హీరోలయిన ప్రభాస్, మహేశ్, గోపీచంద్ తోనూ జోడీ కట్టి ఆకట్టుకున్నారు. ఎవరితో నటించినా, ప్రభాస్ కు అనుష్క హిట్ పెయిర్ అని చెప్పవచ్చు. వీరిద్దరూ నటించిన ‘మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2’ చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధించడం విశేషం. అందంతో బంధాలు వేయడమే కాదు, అభినేత్రిగానూ అనుష్క మురిపించారు. ‘సైజ్ జీరో’ కోసం బరువు పెరిగి దరువేసి మరీ ఉత్తమ నటిగా నంది అవార్డును దక్కించుకున్నారు అనుష్క.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
‘బాహుబలి-2’ తరువాత అనుష్క నటించిన ‘భాగమతి’ భలేగా మార్కులు సంపాదించింది. ఓటీటీలో నేరుగా విడుదలైన అనుష్క చిత్రం ‘నిశ్శబ్దం’ టైటిల్ కు తగ్గట్టుగానే ఏ లాంటి శబ్దమూ చేయలేకపోయింది. నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతోన్న చిత్రంలో అనుష్క నాయికగా నటిస్తూ ఉండడం విశేషం! మునుపటిలా అనుష్క అభినయంతో అలరిస్తే చూడాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. మరి రాబోయే సినిమాలో అనుష్క నటన ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!