NTV Telugu Site icon

Anushka: ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంది…

Anushka

Anushka

సౌత్ లో అందరికన్నా ముందుగా లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ జనరేషన్ హీరోయిన్ ‘అనుష్క శెట్టి’. అరుంధతి సినిమాతో సోలో హీరోయిన్ గా సక్సస్ కొట్టిన అనుష్క, అక్కడి నుంచి వెనక్కి చూసుకున్న సందర్భమే లేదు. హీరోల పక్కన నటిస్తూనే సోలో హీరోయిన్ సినిమాలు చేసిన అనుష్క, బాహుబలి 2 తర్వాత సినిమాలు చెయ్యడం పూర్తిగా తగ్గించేసింది. జీరో సైజ్ సినిమా కోసం ప్రోస్తెటిక్ వాడకుండా, లావు అయిన అనుష్క అక్కడి నుంచే సినిమాలు చెయ్యడం తగ్గించేసింది. 2018లో వచ్చిన భాగమతి తర్వాత అనుష్క నటించిన మరో సినిమా థియేటర్స్ లో ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. 2020లో అనుష్క నటించిన నిశబ్దం సినిమా వచ్చింది కానీ అది ఒటీటీకి మాత్రమే పరిమితం అయ్యింది. దాదాపు అయిదేళ్ల తర్వాత అనుష్క నటిస్తున్న ఒక సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది అంటే అభిమానులు ఎంత ఎగ్జైటెడ్ గా ఉంటారో అర్ధం చేసుకోవచ్చు.

ఆ ఎగ్జైట్మెంట్ ని మరింత పెంచుతూ అనుష్కతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా కలిశాడు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో అనుష్క, ‘అన్విత రవళి శెట్టి’ అనే పాత్రలో నటిస్తోంది. చెఫ్ గా అనుష్క కనిపించనుండగా, నవీన్ పోలిశెట్టి స్టాండ్ అప్ కమెడియన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రిలీజ్ చెయ్యనున్నారు. దాదాపు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ మేకర్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

Show comments