Site icon NTV Telugu

Anupama Parameswaran : “బటర్ ఫ్లై”గా మారిన బ్యూటీ

Butterfly

బబ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులకు ట్రీట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన “బటర్‌ ఫ్లై” అనే సినిమా నుండి ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. “హ్యాపీ బర్త్‌డే అనుపమ పరమేశ్వరన్” అంటూ అనుపమ సీతాకోక చిలుక పెయింటింగ్ ఉన్న పాత గోడ ముందు నిలబడి ఉన్నట్లు కన్పిస్తోంది ఆ పోస్టర్ లో… ఒక కోణంలో చూస్తే అనుపమ సీతాకోక చిలుకలా మారి రెక్కలు విప్పుకుని ఉన్న దేవదూతలా కనిపిస్తోంది.

Read Also : Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్

జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న “బటర్‌ ఫ్లై” చిత్రానికి ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే కూడా ఆయనే అందించారు. ‘బటర్‌ ఫ్లై’లో అనుపమ ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ గా తెరకెక్కనుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి అర్విజ్, గిడియన్ కట్టా సంగీతాన్ని అందించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రాజెక్ట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ ను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Exit mobile version