తెలుగు తెరపై క్యూట్ లుక్స్‌తో ప్రేక్షకుల మనసులు దోచిన అనుపమ పరమేశ్వరన్‌కి 10 ఏళ్లు పూర్తయినప్పటికీ, ఆమె ఉత్సాహం, ప్యాషన్ ఎప్పుడూ అలాగే ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి, ప్రతి సినిమా ఒక కొత్త అనుభవం, ప్రతి పాత్ర ఒక కొత్త సవాల్. దీంతో తాజాగా ఈ 10 ఏళ్ల ప్రయాణం గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
Also Read : Chiru Birthday : పవన్ స్పెషల్ విషెస్‌కి.. చిరు అంతే స్పెషల్ రిప్లై !
అనుపమ మాట్లాడుతూ.. ‘తెలుగులో నా ప్రయాణం మొదలై 10 ఏళ్లు అయ్యింది. కానీ ఇప్పటికీ నేను తొలి సినిమా చేస్తున్నానేమో అనిపిస్తుంది. కొత్త ఊరికి వచ్చి ఇంత గుర్తింపు పొందుతానని కలలో కూడా ఊహించలేదు. ఇక తెలుగు నేర్చుకోవడానికి కూడా అభిమానుల ప్రేమే ఒకింత కారణం. ఇలాంటి మమకారం, ప్రేక్షకుల ప్రోత్సాహమే నాకు ప్రేరణ. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ప్రతి సారి మంచి సినిమాల కోసం తపించాను. ఇకపై నచ్చిన కథల్నే ఎంచుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అని ఆమె పేర్కొంది. అలాగే ఆమె కొత్త సినిమా ‘పరదా’ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పింది. ‘మన దగ్గర కథల కొరత ఎక్కువ. కొన్ని కథలు విన్నా, ఒక్కసారిగా వేరే అనుభూతి వచ్చేలా ఉండదు. కానీ ‘పరదా’ కథ వింటే, చల్లటి గాలి మొహానికి తాకినంత ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. 70 శాతం సీన్స్‌లో ముఖాన్ని చూపకుండా నటించటం పెద్ద సవాల్, కానీ నా శరీర భాష, కళ్ళు, గళం ద్వారా ప్రేక్షకులను కనెక్ట్ చేసుకోవడం సాధ్యమైంది. ప్రతి మహిళా జీవితం లోనూ ఇదే సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ కథలో చూపిన అంశాలు, ఎప్పటికీ తెలిసినప్పటికీ, ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతాయి. కుటుంబంతో కలిసి చూడగల సినిమా ఇది’ అని చెప్పుకొచ్చింది. ప్రజంట్ ఈ అమ్మడు మాటలు వైరల్ అవుతున్నాయి.
