టిల్లు స్క్వేర్‌తో హోమ్లీ లుక్కు నుండి మేకోవర్ అయిన అనుపమ పరమేశ్వరన్ ఈ ఏడాది డ్రాగన్‌తో ఓ మంచి శుభారంభాన్ని తీసుకున్నాన్న ఆనందాన్ని రీసెంట్లీ వచ్చిన జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చెరిపేసింది. టైటిల్ వివాదం వల్ల సరైన ప్రమోషన్లు చేయక ఏదో రిలీజ్ చేశామంటే చేశాం అని తూతూ మంత్రంగా, వ్యవహారం సాగింది. దీని వల్ల కేరళలో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఫిల్మ్ తన కెరీర్‌కు యూజ్ కాకుండా పోయింది. ఈ రిజల్ట్ ముందే ఊహించారేమో తెలుగులో కూడా రిలీజ్ చేయాలనుకుని చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు మేకర్స్.
Also Read : Buzz : కూలీలో రజనీ, వార్ 2లో తారక్ ఎంట్రీలపై హాట్ డిస్కషన్స్
అనుపమ పరమేశ్వర్ కు ఆఫర్ల కొదవ లేదు కానీ చేసిన సినిమాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. ఇప్పటికే తమిళ్, మలయాళంలో కంప్లీటైన లాక్ డౌన్ లాస్ట్ ఇయర్, పెట్ డిటెక్టివ్ ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్‌లో థియేటర్లలో హాయ్ చెప్పాల్సి ఉండగా రిలీజ్ డిలే అవుతున్నాయి. టాలీవుడ ఫిల్మ్ పరదా కూడా ప్రవీణ్ కండ్రేగుల శుభం ప్రాజెక్టుపై ఫోకస్ చేయడంతో పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఆగస్టు 22న డేట్ లాక్ చేసుకుంది. పరదా బైలింగ్వల్ మూవీగా రాబోతుంది. ఇటు తెలుగు, అటు మలయాళంలో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. నెక్ట్స్ త్రీ మంత్స్‌లో త్రీ ఇండస్ట్రీల్లో అనుపమ సందడి చేయనుంది. పరదాతో పాటు తమిళ పడమ్ బైసన్ రాబోతుంది. మారి సెల్వరాజ్ స్పోర్ట్ డ్రామాలో విక్రమ్ సన్ ధ్రువ్ విక్రమ్ హీరో. అక్టోబర్ 17పై ఇప్పటికే కర్చీఫ్ వేసుకుంది ఈ సినిమా. ఇదే కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేస్తున్న కిష్కిందపురి కూడా అదే నెలలో తీసుకు రానున్నారని టాక్. అనేక వాయిదాల అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తోంది అనుపమ.
