Site icon NTV Telugu

Anupam Kher: అనుపమ్ ఖేర్ ఆఫీస్ లో చోరీ.. అవి కొట్టేశారు!

Anupam Kher News

Anupam Kher News

Anupam Kher Mumbai Office Robbery: ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ముంబై కార్యాలయంలో చోరీ జరిగిన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని నటుడు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. తన కంపెనీ సినిమాకి సంబంధించిన నెగెటివ్ తో పాటు సేఫ్‌ను దొంగ దొంగిలించి పారిపోయాడని ఖేర్ చెప్పాడు. ప్రస్తుతం ఖేర్ పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. దొంగతనం జరిగిన విషయాన్ని నటుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అనుపమ్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. అందులో గత రాత్రి, ఇద్దరు దొంగలు నా వీర దేశాయ్ రోడ్ ఆఫీస్‌లో నుండి ఒక సేఫ్‌ను దొంగిలించారు (వారు సేఫ్‌ను బద్దలు కొట్టలేరు కాబట్టి) అని హిందీలో క్యాప్షన్‌లో రాశారు. ఇందులో నా కంపెనీ తీసిన సినిమా నెగెటివ్‌లు ఉన్నాయని ఖేర్ చెప్పాడు.

SDT 18: ఇట్స్ అఫీషియల్.. సాయి ధరమ్ తేజ్‌ తో హనుమాన్ నిర్మాత పాన్ ఇండియా మూవీ..

నా కార్యాలయం తరపున ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశాం, దొంగలు ఆటోరిక్షాలో అన్ని సామాను తీసుకెళ్తున్నట్లు సిసిటివి కెమెరాలలో రికార్డ్ అయినందున అతి త్వరలో దొంగలను పట్టుకుంటామని పోలీసులు మాకు హామీ ఇచ్చారని అన్నారు. దేవుడు వారికి బుద్ధి ప్రసాదించును గాక అని పేర్కొన్న ఆయన పోలీసులు రాకముందే నా బృందం చిత్రీకరించిన వీడియో ఇది అంటూ వీడియో షేర్ చేసి ముంబై పోలీసుల అధికారిక X హ్యాండిల్‌ను కూడా ట్యాగ్ చేశాడు. ఆ నటుడి ముంబయి ఆఫీసులో చోరీకి గురైన కేసు విలువ 4 లక్షలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. అనుపమ్ ఖేర్ తన కార్యాలయాన్ని రాత్రి 9 గంటలకు మూసివేసి ఇంటికి వెళ్లి మరుసటి రోజు కార్యాలయాన్ని తెరిచి చూడగా అక్కడ చోరీ జరిగినట్లు తెలిసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అంబోలి పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

Exit mobile version