NTV Telugu Site icon

Anupam Kher: నా ఫేవరేట్ ఎన్టీఆర్ ను కలిశా.. అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Anupam Kher With Jr Ntr

Anupam Kher With Jr Ntr

Anupam Kher Met Jr NTR and Shares Pic: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో బేస్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమా షూటింగ్ లేని సమయంలో ముంబై మొత్తం చక్కెరలు కొడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఒక డిన్నర్ పార్టీకి భార్యతో కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఆయనని బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆయన కార్తికేయ 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యారు. తర్వాత కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా కూడా ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

Parineeti Chopra: స్టార్ హీరోయిన్ భర్తకు తృటిలో తప్పిన పెను ప్రమాదం?

అలాంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. నేను మా ఫేవరెట్ పర్సన్, నటుడు తారక్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. అతడు చేసే సినిమాలంటే నాకు చాలా ఇష్టం, ఆయన స్థాయి నుంచి పైకి ఎదుగుతుంటే చాలా ఆనందం అనిపిస్తోంది జైహో అంటూ ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక దానికి యాక్టర్స్ అంటూ హ్యాష్ టాగ్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇక వీరిద్దరూ కలిసిన బ్యాక్ గ్రౌండ్ చూస్తుంటే అదేదో బార్ రూమ్ సెటప్ లాగే ఉంది. షూటింగ్ లోకేషన్ అయినా అయ్యుండొచ్చు లేదా నిజంగానే ఏదైనా పబ్లో కలిసి ఉండవచ్చు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తం మీద అనుపమ్ఖేర్ జూనియర్ ఎన్టీఆర్ తో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments