Anudeep KV To Direct Ravi Teja Next: జయాపజయాలతో సంబంధం లేకుండా.. వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్న తెలుగు హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకడు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రవితేజ, పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాకి కూడా సంతకం చేశాడని సమాచారం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం.. జాతిరత్నాలు, ప్రిన్స్ ఫేమ్ అనుదీప్ కేవీతో ఓ సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. రీసెంట్‌గా ఈ యువ దర్శకుడు రవితేజని కలిసి ఒక స్టోరీ వినిపించాడని, అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడని తెలిసింది. ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. రవితేజ ఓ పూర్తిస్థాయి కామెడీ సినిమా చేసి చాలాకాలమే అవుతోంది. ఇప్పుడు అనుదీప్‌తో జతకట్టినట్టు వస్తున్న వార్త నిజమే అయితే.. రవితేజ ఫ్యాన్స్‌కి శుభవార్తేనని చెప్పుకోవచ్చు.
Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…
అయితే.. డైరెక్టర్ అనుదీప్ కేవీ తీసిన రెండు సినిమాల్లో జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది కానీ, ప్రిన్స్ మాత్రం బోల్తా కొట్టింది. మొదటి సినిమా తరహాలో ఇందులో కామెడీ పండలేదని, మరీ సిల్లీ జోక్స్‌తో ఆ సినిమాని రూపొందించాడని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అందుకే, అతడు సినిమాలకు కొంత గ్యాప్ తీసుకొని, ఒక బలమైన స్టోరీని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ స్టోరీకి ఎవరు సెట్ అవుతారా? అని పరిశీలించి.. ఫైనల్‌గా రవితేజతో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు. మరి, ఈ కాంబో వర్కౌట్ అవుతుందో? లేదో చూడాలి. మరోవైపు.. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘ఈగల్’ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండింటిలో టైగర్ నాగేశ్వరరావు మీద భారీ అంచనాలే ఉన్నాయి. స్టువర్ట్‌పురం దొంగ రియల్ లైఫ్ ఆధారంగా ఇది తెరకెక్కుతుండటం, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుండటంతో.. ఇది తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.
Pawan Kalyan : కాకినాడలో రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి