ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమ కాస్త ప్రశాంతతను పొందుతుందీ అనుకునే లోపు మరో కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది. లాస్ట్ ఇయర్ అంతా దర్శన్ ఇష్యూ, రీసెంట్లీ కమల్ భాషా వివాదం సద్దుమణిగిందిలే అని ఫీలవుతుంటే. స్టార్ హీరోయిన్ రచితా రామ్ వల్ల టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇంతకు మేడమ్ ఏం చేసిందంటే నయన్ తారలా ప్రమోషన్లకు డుమ్మా కొడుతుందట. శాండిల్ వుడ్ స్టార్ డైరెక్టర్ నాగశేఖర్ తెరకెక్కించిన ఫిల్మ్ సంజు వెడ్స్ గీతా 2. 2011లో వచ్చిన సంజు వెడ్స్ గీతాకు సీక్వెల్. ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తే పెద్దగా ఆడలేదు. దీంతో జూన్ 6న రీ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.
Also Read : Kuberaa : కుబేర 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. సూపర్ స్ట్రాంగ్
సంజు వెడ్స్ గీతా2 రీ రిలీజ్ సందర్బంగా రాజ్ కుమార్, ఉపేంద్ర లాంటి స్టార్ హీరోలు మద్దతుగా నిలుస్తుంటే రచితా మాత్రం ప్రమోషన్లలో పాల్గొనకుండా ఎగొట్టడంపై మేకర్లకు కోపమొచ్చింది. వెంటనే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో దర్శకుడు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. రిక్వెస్ట్ చేసినా, రాక్ లైన్ వెంకటేష్ లాంటి నిర్మాత సంప్రదించినా ఈ డింపుల్ క్వీన్ రాలేదని వాపోతున్నాడు డైరెక్టర్. ఇదిలా ఉంటే రచితా రామ్ పాత వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఉపేంద్ర హీరోగా రచితా హీరోయిన్‌గా ఉప్పీ- రుప్పీ అనే మూవీ ఫిక్సైంది. ఈ సినిమా కోసం రూ. 13 లక్షలు అడ్వాన్స్ తీసుకుంది రచితా. మాదేష్ దర్శకుడిగా ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ జరిగింది. కొంత షూటింగ్ అయ్యాక ఈ సినిమా నుండి రచితా తప్పుకుంది. కానీ అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం లేదని నిర్మాత విజయలక్ష్మీ ఆరోపిస్తున్నారు. షూటింగ్ కోసం కోట్లు ఖర్చుపెట్టి నష్టపోయామంటున్నారు ప్రొడ్యూసర్. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లయింట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రచితా వీటిపై రెస్పాండ్ కాలేదని టాక్. మరీ డింపుల్ బ్యూటీ ఎప్పుడు స్పందిస్తుందో. తెలుగులో కూడా కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చిలో నటించింది.
