Ankith Koyya : హీరోగా నటించాలంటే భయమేసింది.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రల్లో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమూర్ భన్సల్ నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అంకిత్ కొయ్య మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
‘బ్యూటీ’ కథలోకి ఎలా వచ్చారు? కథ విన్నాక ఏమనిపించింది?
‘బ్యూటీ’ అనే టైటిల్‌ను, లోగోను అంతా కూడా మారుతి గారు డిజైన్ చేశారు. ఈ టైటిల్ పెట్టిన తరువాత, అంతా ఫిక్స్ అయిన తరువాతే నేను ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ‘బ్యూటీ’ కథ విన్న తరువాత నేను షాక్ అయ్యాను. నాకు కథ చాలా బాగా నచ్చింది. కాకపోతే ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డాను.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
‘బ్యూటీ’లో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇంత వరకు నన్ను ఎప్పుడూ చూడనటువంటి పాత్రలో ఆడియెన్స్ చూస్తారు. అర్జున్ పాత్రలో నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మొదట్లో భయపడ్డాను. అయితే ఓ నటుడిగా పాత్రకు న్యాయం చేయాలన్నదే నేను మైండ్‌లో పెట్టుకున్నాను. పాత్రకు కావాల్సినట్టుగా నటించాను.
‘బ్యూటీ’ చిత్రంలో అసలైన బ్యూటీ ఏంటి? ఎవరు?
‘బ్యూటీ’ చిత్రానికి నరేష్ గారు హీరో. ఆయన పాత్ర నాకు చాలా ఇష్టం. కథ విన్నప్పుడే ఆ పాత్రకి ఎక్కువగా కనెక్ట్ అయ్యాను. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్‌గా నరేష్ గారు నటించిన తీరుకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. ఈ మూవీకి ప్రధాన బలం కూడా ఆయనే. నరేష్ గారు, వాసుకి గారి గురించే ఆడియెన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటారు.
‘బ్యూటీ’లో నీలఖి పాత్ర ఎలా ఉంటుంది? ఆమెతో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది?
అలేఖ్య పాత్రలో నీలఖి అద్భుతంగా నటించారు. ఇంటిమేట్ సీన్లలో నటించేందుకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. నీలఖికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అని అనుకునే వాడ్ని. కానీ ఆమె మాత్రం పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఆమె మాకు ఎంతో సహకరించారు.
‘బ్యూటీ’ విషయంలో దర్శకుడు వర్దన్‌తో జర్నీ ఎలా అనిపించింది?
వర్ధన్‌తో నేను కథా చర్చల్లో కూడా పాల్గొన్నాను. ప్రతీ చిన్న విషయాన్ని డీటైలింగ్‌గా మాట్లాడుకునే వాళ్లం. డైరెక్టర్ కథను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ప్రతీ పాత్రకు ఓ జస్టిఫికేషన్ ఇచ్చారు.
‘బ్యూటీ’ కోసం నిర్మాత విజయ్ పాల్ రెడ్డి ఎక్కువ బడ్జెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది?
‘బ్యూటీ’ విషయంలో నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మాకు ఏం కావాలన్నా వెంటనే ఏర్పాటు చేసేవారు. ప్రొడక్ట్ బాగా రావాలనే ఎప్పుడూ పరితపించేవారు. ఇక మాకు అండగా మారుతి గారు, జీ స్టూడియో నిలబడింది. వారందరి సహకారంతోనే ‘బ్యూటీ’ ఇంత గొప్పగా వచ్చింది.
‘బ్యూటీ’ పాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మ్యూజిక్ గురించి చెప్పండి?
‘బ్యూటీ’ పాటలు అద్భుతంగా వచ్చాయి. ‘కన్నమ్మ’ పాట అయితే ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. విజయ్ బుల్గానిన్ మాకు మంచి పాటలు ఇచ్చారు. సినిమాలో ఆర్ఆర్ చూస్తే మా సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లినట్టుగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌కు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు.
‘బ్యూటీ’ నుంచి ఆడియెన్స్ ఏం ఆశించొచ్చు?
‘బ్యూటీ’ ప్రతీ ఇంట్లో, ప్రతీ వీధిలో జరిగే కథ. అందరికీ తెలిసిన కథే. అయినా సరే అందరూ తెలుసుకోవాల్సిన కథ. ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియపర్చే కథ ఇది. మిడిల్ క్లాస్ ఫాదర్ ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించాం. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ‘బ్యూటీ’ చిత్రం ఉంటుంది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?