Site icon NTV Telugu

యదార్థ సంఘటనలతో గ్రామీణ ప్రేమకథా చిత్రమ్!

తనిష్క్ రెడ్డి, అంకిత సాహు జంటగా నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. రిచా భట్నాగర్, విజయలక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తనిష్క్ రెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ‘జెర్సీ, మళ్ళీ రావా’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన మాధవ్ మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్ లో ఉండటంతో తాను ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టు తనిష్క్ రెడ్డి తెలిపాడు. ‘యదార్థ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ ఇదని; ఎమోషన్, యాక్షన్ వంటి స్ట్రాంగ్ కంటెంట్‌తో వస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబర్ చివరి వారం మొదలు పెడతామ’ని దర్శకుడు మాధవ్ మూర్తి చెప్పాడు. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వెంకట్ యాదవ్ క్లాప్ కొట్టగా, జ్యోత్స కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version