Anjali Sivaraman: హీరోయిన్గా కాదు.. అమృతా షేర్గిల్గా అంజలి.. 100 ఆడిషన్ల తర్వాత బిగ్ ఛాన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anjali Sivaraman: నటి, గాయని అయిన అంజలి శివరామన్ ‘కోబాల్ట్ బ్లూ’ (2022) లో ‘అనూజ’ పాత్ర ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఆమెకు నెట్‌ఫ్లిక్స్ హిట్ సిరీస్ ‘క్లాస్’ (2023) లోని ‘సుహాని అహుజా’ పాత్ర దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2025లో వెట్రిమారన్ నిర్మించిన ‘బ్యాడ్ గర్ల్’ సినిమాతో తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ప్రస్తుతం దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ ‘ఆమ్రి’లో ప్రసిద్ధ చిత్రకారిణి అమృతా షేర్-గిల్ టైటిల్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఈ అవకాశం అంజలికి అంత సులభంగా దక్కలేదని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. దాదాపు 100 మంది యువతులు ఆ పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వగా, చివరకు తనని సెలెక్ట్ చేశారని, మీరా నాయర్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని అంజలి చెబుతున్నారు. మీరా నాయర్ వంటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకురాలితో కలిసి పనిచేయడం తన కల నెరవేరినట్టేనని, చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు తెలిపారు.
అంజలి శివరామన్ పోషిస్తున్న పాత్ర అమృతా షేర్-గిల్ మన దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప మోడ్రన్ పెయింటర్. తండ్రి పంజాబీ సిక్కు, తల్లి హంగేరియన్ మహిళ. 1913లో హంగేరిలో పుట్టిన ఈమె పారిస్‌లో పెయింటింగ్ నేర్చుకుని వెస్ట్రన్ స్టైల్‌ని మన ఇండియన్ ట్రెడిషనల్ స్టైల్‌తో కలిపి అద్భుతమైన బొమ్మలు గీసేవారు. ముఖ్యంగా మన దేశంలోని పల్లెటూరి జనాలు, పేద మహిళల కష్టాలను, వారి దైనందిన జీవితాన్ని తన పెయింటింగ్స్‌లో ఎంతో సహజంగా చూపించేవారు. అందుకే ఈమెను ‘ఇండియన్ ఫ్రిదా కాహ్లో’ అని కూడా పిలుస్తారు. కేవలం 28 ఏళ్ల చిన్న వయసులోనే (1941లో) ఆమె చనిపోయినప్పటికీ, ఆమె గీసిన ‘త్రీ గర్ల్స్’, ‘బ్రహ్మచారీస్’ వంటి పెయింటింగ్స్ ఇండియన్ ఆర్ట్ హిస్టరీలోనే ఎంతో స్పెషల్‌గా నిలిచాయి. ఇప్పుడు అమృతా షేర్గిల్గా కనిపించబోతున్న అంజలి శివరామన్ కి ‘ఆమ్రి’ ఏ స్థాయిలో గుర్తింపును ఇస్తుందో చూడాల్సిఉంది.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Tags
- Anjali Sivaraman
- cinema
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!