Site icon NTV Telugu

Anjali Raghav : భోజ్‌పురి స్టార్ పవన్ సింగ్ అనుచిత ప్రవర్తనపై.. స్పందించిన నటి

Anjali Raghav Pawan Singh

Anjali Raghav Pawan Singh

తాజాగా భోజ్‌పురి ఇండస్ట్రీకి చెందిన సూపర్‌స్టార్ పవన్ సింగ్ ఒక ఈవెంట్‌లో హీరోయిన్‌ న‌టి అంజ‌లి రాఘ‌వ్ న‌డుమును అనుమ‌తి లేకుండా తాకిన విష‌యం తెలిసిందే. వీరిద్దరూ క‌లిసి చేసిన ‘సైయా సేవ కరే’ అనే ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా లక్నోలో జరిగిన ఒక ఈవెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప‌వ‌న్ సింగ్ తీరును త‌ప్పుబ‌ట్టారు. ఈ ఘ‌ట‌న జ‌రిగి రెండు రోజులు అయిన న‌టి ఇంకా స్పందించ‌లేద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే తాజాగా అంజలి రాఘవ్ ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. ప‌వ‌న్ సింగ్ ప్రవ‌ర్తనపై ఆగ్రహాం వ్యక్తం చేసింది.

Also Read : Pawan Singh : పబ్లిక్‌గా హీరోయిన్‌తో స్టార్ హీరో సరసాలు.. స్టేజ్‌పైనే వివాదం!

అంజలి మాట్లాడుతూ, “ఏ అమ్మాయిని అయినా అనుమతి లేకుండా తాకడం తప్పు. ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందాను. నేను ఈవెంట్‌లో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ నా నడుముపై ఏదో అంటుకుని ఉందని.. దానికి తీసే క్రమంలో నను తాకారు అనుకున్నా. నేను ఆ రోజు కొత్త చీర కట్టుకున్నందున బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటికి వచ్చిందేమోనని నవ్వాను. ఆ తర్వాత తన టీమ్ మెంబర్‌ను అడిగితే అక్కడ ఏమీ లేదని చెప్పడంతో నాకు చాలా కోపం తో పాటు బాధ కలిగింది. ఈ విష‌యంపై ప్రైవేట్‌గా మాట్లాడదామని అనుకునేలోపే పవన్ సింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. హర్యానాలో ఇలాంటివి జరిగితే స్థానికులు వెంటనే స్పందిస్తారు, కానీ నేను లక్నోలో ఉన్నందున ఇది నా ప్రాంతం కాదు. ఈ ఘ‌ట‌న గురించి బయట మాట్లాడితే.. ప‌వ‌న్ సింగ్‌కి భారీ నెట్‌వ‌ర్క్ ఉందంటూ త‌న‌ను బెదిరించారు. అందుకే ఈ ఘ‌ట‌న గురించి నేను మాట్లాడ‌కుండా మౌనంగా ఉన్న కొన్నిరోజుల‌కు ఈ విషయం సద్దుమణుగుతుందనుకున్న. కానీ ఈ ఘ‌ట‌న‌ మరింత పెద్దదిగా మారింది’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సంఘటన తర్వాత భోజ్‌పురి చిత్రాల్లో ఇకపై నటించను” అని చెప్పారు.

 

Exit mobile version