Site icon NTV Telugu

Bigg Boss 7: రెమ్యునరేషన్ ఇష్యూ.. చివరి నిముషంలో టీంకి హ్యాండ్ ఇచ్చిన నటి?

Bigg Boss 7 Anjali Pavan Dropped

Bigg Boss 7 Anjali Pavan Dropped

Anjali Pavan Dropped from Bigg Boss 7 telugu in Last Minute: తెలుగు సీరియల్స్ లో తెలుగు అమ్మాయిలు చాలా రేర్ గా అవకాశాలు అనుకోవడమే కాదు స్టార్ స్టేటస్ దక్కించుకుంటారు. అలా మొగలిరేకులు సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించింది అంజలి. పవన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అంజలి పవన్ గా మారిన ఆమె ప్రస్తుతానికి పలు సీరియల్స్ లో నటిస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇంస్టాగ్రామ్ లో 15 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న ఆమె ఇట్లు మీ అంజలి అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. అందులో తనకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అయితే అంజలి పవన్ బిగ్ బాస్ సెవెన్ కి ఎంపికైనట్లు గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఆమె బిగ్ బాస్ 7 సీజన్ కి ఎంపికైంది కూడా. అయితే రెమ్యూనరేషన్ విషయంలో బిగ్ బాస్ టీం అంజలి పవన్ మధ్య సయోధ్య కుదరలేదని చెబుతున్నారు. ముందు నుంచి అంజలి పవన్ బిగ్ బాస్ రెమ్యునరేషన్ విషయంలో అంత సంతృప్తికరంగా లేదు.

Pooja Murthy: కొద్ది గంటల్లో బిగ్ బాస్ కి వెళ్తుందనగా నటి ఇంట తీవ్ర విషాదం.. ఎంట్రీ క్యాన్సిల్

ఇప్పటివరకు తాను వస్తాను అని చెప్పిన ఆమె ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో గట్టి పట్టు పట్టిందని, తనకు అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే తాను హౌస్ లోకి అడుగు పెట్టేది లేదని కరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చివరి నిమిషంలో ఆమె హ్యాండ్ ఇవ్వడంతో ఆమెకు రీప్లేస్మెంట్ గా ఎవరిని తీసుకోవాలి అనే విషయం మీద బిగ్ బాస్ టీం ఆలోచనలో పడింది. చివరి నిమిషంలో ఇలాంటి డ్రాప్ ఔట్లు ఉంటారని తెలిసే ముగ్గురు నలుగురిని సేఫ్ సైడ్ గా ఎంపిక చేసుకుని టీం పక్కన పెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అలా ఎంపిక చేసుకున్న వారిలో లోపలికి ఎవరిని పంపబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మరి కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరొక కంటెస్టెంట్ పూజా మూర్తి తండ్రి చనిపోవడంతో ఆమె కూడా బిగ్ బాస్ 7 సీజన్ కి డ్రాప్ అయ్యారు. ఈ లెక్కన ఇద్దరు కంటెస్టెంట్లను బిగ్ బాస్ సెవెన్ టీం వెతుక్కుని లోపలికి పంపాల్సి ఉంటుంది.

Exit mobile version