NTV Telugu Site icon

Krishna Vrinda Vihari: స్టోరీ నెరేషన్ పై అనీశ్ కృష్ణ షాకింగ్ కామెంట్!

Krishna Vrinda Vihari

Krishna Vrinda Vihari

 

వెర్సటైల్ హీరో నాగశౌర్య, డైరెక్టర్ అనీశ్ ఆర్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ మూవీతో షిర్లీ సెటియా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మహతి స్వరసాగర్ దర్శకత్వంలో ఈ మూవీని నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 23న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో దర్శకుడు అనీశ్ ఆసక్తికరమైన విషయాలను మీడియాకు తెలిపాడు. ఈ మూవీ ఎలా ఓకే అయ్యిందో వివరిస్తూ, ”నాగశౌర్యకు రెండేళ్ళ క్రితం ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన హోమ్ బ్యానర్ లోనే ఈ కథ చేయాలని నిర్ణయించారు. నిజానికి హీరోలకు కథని నేను నెరేట్ చేయను. నెరేషన్ లో నేను కొంచెం వీక్. నా సహాయ దర్శకుడితో చెప్పిస్తుంటాను. కాని తొలిసారి ఈ కథని శౌర్యగారికి నేనే చెప్పాను. కథలో వున్న బలం అలాంటిది. నేను చెప్పినా ఓకే అవుతుందనే నమ్మకంతో చెప్పాను. నేను చెప్పినప్పుడే ఆయనకు చాలా నచ్చేసింది. ఓకే అనేశారు. ఇప్పటివరకూ ఇందులో వున్న యూనిక్ పాయింట్ ని ఇంకా రివిల్ చేయలేదు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో కథపై ఒక అవగాహన ఇస్తాం. అయితే ఈ కథకి మూలం చెప్తాను. నాకు బాగా కావాల్సిన సన్నిహితుడు జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఫ్రేమ్ చేసుకున్న కథ ఇది. ఈ పాయింట్ చాలా ఎంటర్ టైనర్ గా వుంటుంది. ప్రేక్షకులు హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

ఇందులో హీరో పోషించిన బ్రాహ్మణ యువకుడి పాత్ర గురించి చెబుతూ, ”ఇటీవలే వచ్చిన నాని ‘అంటే సుందరానికీ’లో ఆయన కూడా బ్రాహ్మణ యువకుడిగా నటించారు. ఆ సినిమా నేను చూశాను. నాని గారికి ఒక ప్రత్యేక శైలి వుంది. ఆయనే కాదు.. అల్లు అర్జున్ గారు ‘డీజే… దువ్వాడ జగన్నాథం’, ఎన్టీఆర్ గారు ‘అదుర్స్’, కమల్ హాసన్ గారు ‘మైకేల్ మదన్ కామరాజు’ ఇలా ఎవరి స్టయిల్ వారికి వుంటుంది. నాగశౌర్య గారికి కూడా ఒక యూనిక్ స్టయిల్ వుంది. ఆయనలో ఒక రకమైన అమాయకత్వం, క్యూట్ నెస్, కొంటెతనం, అల్లరి వుంటుంది. కృష్ణ పాత్రకు నాగశౌర్య యాప్ట్. ఇందులో నేను ఎంచుకున్న నేపధ్యం కూడా ఆచార్యులు. శౌర్యగారిని చూడగానే ఆ ఛార్మ్ కనిపించింది. అందుకే కథ పూర్తయిన తర్వాత మొదట శౌర్యగారినే కలిశాను. ఆయనకీ చాలా గొప్పగా నచ్చింది.” అని చెప్పారు. ఈ చిత్ర కథానాయకుడు నాగశౌర్య ప్రస్తుతం మూవీ ప్రమోషన్ లో భాగంగా పాదయాత్ర చేస్తున్నాడు. దాని గురించి చెబుతూ, ”అది ఆయన ఆలోచనే. ఈ సినిమా ఆయనకి చాలా నమ్మకాన్ని కలగజేసింది. ఆయన ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఆనందం ప్రేక్షకులు కూడా పొందాలని ఆయనే స్వయంగా జనాల్లోకి వెళ్లారు. పాదయాత్రకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత సినిమాపై బజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది” అని చెప్పారు. తన తొలి చిత్రం ‘అలా ఎలా’ ని చాలా స్వేచ్ఛగా తీశానని, అది ప్రేక్షకులకు చాలా నచ్చిందని, మళ్ళీ ఇంతకాలానికి ఈ సినిమాను అలానే తెరకెక్కించానని, నాగశౌర్యతో పాటు బ్రహ్మాజీ , రాహుల్ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్ పాత్రలు మంచి వినోదాన్ని పంచుతాయని అనీశ్‌ కృష్ణ తెలిపారు.

తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి వివరిస్తూ, ”నాకు ఇండస్ట్రీ నేపధ్యం లేదు. అంతకుముందు సినిమాలకి కూడా పని చేయలేదు. నా మొదటి సినిమా నిర్మాత నా స్నేహితుడే కావడం వలన చాలా సులువుగానే దర్శకుడిగా పరిచయమయ్యాను. ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ అనుభవంతో ఇకపై చక్కని ప్లానింగ్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తా. కొన్ని కథలు రెడీ చేస్తున్నా. ఒక డార్క్ హ్యుమర్ కథ రెడీ అవుతోంది. అలాగే గాడ్ ఫాదర్, దళపతి స్టయిల్ లో యాక్షన్ ఎమోషనల్ మూవీ చేయాలని వుంది” అని అన్నారు.

Show comments