Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్‌కు ‘డ్రగ్’ షాక్.. 90 రోజులకోసారి టెస్ట్.. నెగటివ్ వస్తేనే సినిమా రిలీజ్?

Drugs

Drugs

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి టాలీవుడ్ స్టార్ హీరోలకు ఒక ఊహించని సవాల్ విసిరారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే క్రమంలో సినీ తారలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అందుకోసం ప్రతి 90 రోజులకోసారి ‘ఫాలికిల్ డ్రగ్ టెస్ట్’ చేయించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ఈ క్రమంలో అభిమానులపై సినీ తారల ప్రభావం ఎంత బలంగా ఉంటుందో అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. “ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ‘సిక్స్ పాకెట్ ప్యాంట్లు’ వేసుకుంటే, రాష్ట్రవ్యాప్తంగా యువత అంతా ఆ ట్రెండ్‌ను ఎలా ఫాలో అయ్యారో మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు హీరోలు డ్రగ్స్ తీసుకోమని, తాము స్వచ్ఛంగా ఉన్నామని నిరూపించుకుంటే.. అభిమానులు కూడా వారిని ఆదర్శంగా తీసుకుని వ్యసనాలకు దూరంగా ఉంటారు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:Youth: 4 రోజుల్లో 3.73 కోట్లు సాధించిన యూత్

అనిరుధ్ రెడ్డి కేవలం సలహా ఇవ్వడమే కాకుండా, ఒక కఠినమైన నిబంధనను కూడా తెరపైకి తెచ్చారు. ప్రతి 90 రోజులకోసారి డ్రగ్ టెస్ట్ చేయించుకుని, అందులో ‘నెగటివ్’ అని రిపోర్ట్ వస్తేనే ఆ హీరోల సినిమాలను థియేటర్లలో విడుదల చేసేలా చట్టం తీసుకురావాలని, యువతను పక్కదారి పట్టించకుండా, సెలబ్రిటీలు సమాజానికి ఒక మంచి ఉదాహరణగా నిలవాలన్నదే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి. ఒకవైపు డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొందరు స్వాగతిస్తున్నా, సినిమాల విడుదలను డ్రగ్ టెస్టులతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా మొదలైంది. మరి ఈ ప్రతిపాదనపై ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (MAA) లేదా టాలీవుడ్ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Exit mobile version