Site icon NTV Telugu

Anirudh : కావ్య మారన్‌‌తో అనిరుధ్ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్

Anirudh Ravichander, Srh Owner Kavya Maran,

Anirudh Ravichander, Srh Owner Kavya Maran,

ప్రజంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారుమ్రోగిపోతోన్న పేరు  అనిరుధ్.. అనిరుద్‌ రవిచందర్‌. 13 ఏళ్ల వయసులోనే ‘కొలవెరి డీ’ సాంగ్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాడు. అక్కడితో మొదలు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్‌ సినిమాలకు పనిచేశాడు. ఇక పోతే సెలబ్రెటీస్ మీద పెళ్లి వార్తలు ప్రచారం కావడం చాలా కామన్. కానీ కొన్ని సార్లు అది నిజం కూడా అవ్వచ్చు. అలా ఇప్పటికి చాలానే జరిగాయి. ఇక ప్రజంట్ అనిరుధ్ పై కూడా ఇలాంటి వార్త ఒకటి బాగా వైరల్ అవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు యజమాని కావ్య మారన్‌ని, అనిరుధ్ రవిచందర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వైర‌ల్ అవుతున్నాయి. అనిరుధ్ ఆమెతో ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారని, త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే జాతాజా ఈ వార్తలపై అనిరుధ్ వ్యక్తిగత బృందం తాజాగా క్లారిటీ ఇచ్చింది..

Also Read : Nani : నేచురల్ స్టార్ నానిని కలిసిన.. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిషన్

అనిరుధ్‌పై సోష‌ల్ మీడియాలో వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని.. కావ్య మార‌న్ తాను మంచి స్నేహితులు మాత్రమే, అనిరుధ్‌పై ఇలాంటి వార్తలు రావ‌డం కొత్తేమికాదు. ఇంత‌కుముందు కూడా నటి కీర్తి సురేష్, గాయని జోనితా గాంధీ, నటి త్రిషలతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వ‌చ్చాయి. అయితే ఆ వార్తలు కూడా రుమార్స్ అని త‌ర్వాత తెలిసింది. అంటూ అనిరుధ్ బృందం స్పష్టం చేసింది. కానీ దీనిపై కావ్య మారన్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి ఇవి కేవలం పుకార్లుగానే మిగులుతాయా చూడాలి..

Exit mobile version