Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారంటూ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై రకరకాల పుకార్లు వస్తున్న టైమ్ లో అలాంటిదేమి లేదని అనిరుధ్ ఆ మధ్య అన్నాడు. కానీ వీరి పెళ్లి కన్ఫామ్ అని చెన్నై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్ ఈ విషయమై స్పందించడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది. వైజీ మహేంద్రన్ వీరిద్దరి రిలేషన్‌ను మరియు పెళ్లి వార్తలను కన్ఫామ్ చేసారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని, ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఈ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మహేంద్రన్ చెప్పకనే చెప్పినట్టు చెప్పారు. ఈ క్రేజీ జంట పెళ్లి వార్త బయటకు రావడంతో అటు సినిమా పరిశ్రమలోనూ, ఇటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది. కాగా సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్యా మారన్‌కు సోషల్ మీడియాలో ‘నేషనల్ క్రష్’గా విపరీతమైన క్రేజ్ ఉంది. మరోవైపు అనిరుధ్ సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అంటేనే ఆ సినిమా బజ్ వేరే లెవల్ లో ఉంటుంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!