Site icon NTV Telugu

Animal: అక్కడ ఈ సినిమా టికెట్ రేట్ తెలిస్తే ఫ్యూజులు కొట్టేస్తాయ్…

Animal

Animal

ఈ మధ్య పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వగానే టికెట్ రేట్స్ పెంచుకోవడం సాధారణం అయిపొయింది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కినా… అది రిలీజ్ అయ్యే సమయానికి ప్రభుత్వాల నుంచి పర్మిషన్స్ తెచ్చుకోని టికెట్ రేట్స్ అండ్ షో కౌంట్స్ పెంచుకుంటున్నారు. ఇదే లిస్టులో చేరుతుంది సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ. డిసెంబర్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమా టికెట్ రేట్స్ అన్ని సెంటర్స్ లో ఫుల్ గా పెరిగాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో షోస్ కూడా విపరీతంగా పెంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే డే 1 అనిమల్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం గ్యారెంటీ. ఆ రేంజ్ బుకింగ్స్ ని రాబడుతుంది. అయితే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్లి చూడాలి అంటే 2000-2500 ఖర్చు అవుతుంది.

ఇదే నార్త్ లోని రెండు సెంటర్స్ లో అయితే అనిమల్ సినిమాని థియేటర్ లో చూడాలి అని ఒక్కరు అనుకున్నా కూడా 2000-2500 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో అనిమల్ సినిమా టికెట్ రేట్ భారీగా పెరిగాయి. ఢిల్లీలో 2500కి అనిమల్ టికెట్ దొరుకుతుంటే, ముంబైలో 2000కి దొరుకుతుంది. అంటే నలుగురు థియేటర్ కి వెళ్లి అనిమల్ సినిమాని చూడాలి అంటే కనీసం 10000 ఖర్చు అవ్వడం గ్యారెంటీ. ఇది చాలా ఎక్కువా అనే చెప్పాలి, ఇంత ఎక్కువ ఉన్నా కూడా అనిమల్ సినిమాకి భారీ డిమాండ్ ఉంది. టికెట్స్ రేట్స్ తో సంబంధం లేకుండా బుక్ అవుతున్నాయి. మరి సందీప్ రెడ్డి వంగ-రణబీర్ కపూర్ కలిసి అనిమల్ సినిమాతో కలెక్షన్స్ విషయంలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Exit mobile version