NTV Telugu Site icon

Animal: 9వ రోజు 60 కోట్లు కలెక్ట్ చేశాడా? అరాచకం అనేది కూడా చిన్న పదంలా ఉంది

Animal

Animal

ర్యాంపేజ్ అనే పదాన్ని వినడం తప్ప ఏ రోజు ఏ సినిమా కలెక్షన్స్ విషయంలో ర్యాంపేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చెయ్యలేదు. ఎన్నో పాన్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చే రేంజ్ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడతాయి కానీ ఫస్ట్ వీక్ కి దాదాపు అన్ని సినిమాలు స్లో అవుతాయి. ఈ విషయానికి నేను అతీతం అంటుంది అనిమల్ మూవీ. ర్యాంపేజ్ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తూ అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంది. మొదటివారం వరల్డ్ వైడ్ గా 550 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన అనిమల్ సినిమా. సెకండ్ వీక్ స్టార్ట్ అయ్యి రెండు రోజులే అయ్యింది అప్పుడే 110 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. నాలుగు, అయిదు, ఆరు, ఏడు, ఎనిమిది రోజుల్లో ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కొత్త బెంచ్ మర్క్స్ ని సెట్ చేసింది అనిమల్ మూవీ.

9వ రోజు మాత్రమే ఫ్యూచర్ లో కూడా ఏ సినిమా బ్రేక్ చేయలేని ఫిగర్ ని సెట్ చేసింది. అనిమల్ మూవీ ఎనిమిదవ రోజు 600 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే… 9వ రోజు ఎండ్ అయ్యే టైమ్ కి 660 కోట్లని కలెక్ట్ చేసింది అంటే 9వ రోజు అనిమల్ సినిమా 60 కోట్లని రాబట్టింది. ఇది బిగ్గెస్ట్ అఛీవ్మెంట్ అనే చెప్పాలి. మౌత్ టాక్ అనిమల్ సినిమాకి విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సండే అనిమల్ కలెక్షన్స్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిన్నటి స్థాయిలోనే ఈరోజు కూడా బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి రేపటి అనిమల్ మూవీ 750 కోట్ల దగ్గర్లో ఉండే అవకాశం ఉంది. ఒక A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం కొత్త హిస్టరీని క్రియేట్ చేయడమనే చెప్పాలి. ఫైనల్ రన్ కి ఇంకా 11 రోజుల సమయం ఉంది కాబట్టి అనిమల్ సినిమా కలెక్షన్స్ ఎక్కడ వరకూ వచ్చి ఆగుతాయో చూడాలి.

Show comments