Site icon NTV Telugu

Animal Abrar Entry Song: ‘జమల్’ సాంగ్ వచ్చేసింది బ్రో…

Animal Abrar Song Entry

Animal Abrar Song Entry

అనిమల్ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం… ఇంత డ్యూరేషన్ ఉన్నా కూడా ఆడియన్స్ కి బాగా గుర్తుండి పోయే ఎపిసోడ్ బాబీ డియోల్ ఎంట్రీ. ఒకప్పటి స్టార్ హీరో బాబీ డియోల్ అనిమల్ సినిమాలో విలన్ గా నటించాడు. డైలాగ్స్ లేకుండా మూగ వాడిగా అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఆడియన్స్ లవ్ ని సొంతం చేసుకున్నాడు. తెరపై కనిపించింది కాసేపే గట్టిగా మాట్లాడితే అయిదారు నిముషాలు మాత్రమే కానీ బాబీ డియోల్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం ఇప్పట్లో మర్చిపోయేది కాదు. కరుడుగట్టిన నెగటివ్ షేడ్ ఉన్న విలన్ గా నటించిన బాబీ డియో తన ఇంట్రడక్షన్ సీన్ లో మాత్రం చాలా కూల్ గా, సరదాగా డాన్స్ చేస్తూ, చిల్ అవుతూ కనిపిస్తాడు.

Read Also: Hi Nanna: “ఇదే ఇదే”… లాస్ట్ సాంగ్ అవుతుందా ఇంకోకటి ఉందా?

బాబీ డియోల్ పెళ్లి సీన్ లో జమాల్ జమాలో సాంగ్ తో బాబీ ఇంట్రడక్షన్ జరిగింది. ఫార్సీ లాంగ్వేజ్ లో ఖటిరాహ్ గ్రూప్ కంపోజ్ చేసిన ఈ ఓల్డ్ ఇరానియన్ ‘జమల్ జమాలో’. ఈ సాంగ్ ని పదేళ్ల క్రితం 2013లో యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. అప్పటి ఆ పాటని సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాలో బాబీ డియోల్ కోసం వాడాడు. అనిమల్ సినిమా కన్నా ఎక్కువ లవ్ ని గెలుచుకున్న ఈ సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. దీంతో అనిమల్ మేకర్స్… జమాల్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ బయటకి వచ్చిన గంట లోపే నాలుగు లక్షల వ్యూస్, లక్ష లైక్స్ ని సొంతం చేసుకుంది.

Exit mobile version