Site icon NTV Telugu

Animal Collections: ఇదేం అరాచకం సందీప్ రెడ్డీ.. మరీ వయలెంట్ గా ఉన్నావే!

Sandeep Animal Counter

Sandeep Animal Counter

Animal Collections as Counter to its Negative Reviews: తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత అదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత యానిమల్ అనే సినిమా అనౌన్స్ చేసి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారిపోయాడు. ఇక డిసెంబర్ ఒకటో తేదీని విడుదలైన యానిమల్ సినిమా అనేక సంచలన రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 817 కోట్ల 36 లక్షల ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసిందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Manchu Lakshmi: గడ్డ కట్టే చలిలో బికినీ వేసిన మంచు లక్ష్మి.. వీడియో వైరల్

అయితే సాధారణంగా ఇలా అనౌన్స్ చేయడం అనేది ప్రతి సినిమా యూనిట్ చేసే విషయమే. కానీ యానిమల్ సినిమా యూనిట్ మాత్రం ఒక అడుగు ముందుకేసి ఎవరైతే ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఎవరైతే ఇచ్చారో ఆ రివ్యూ ట్వీట్ దగ్గరకు వెళ్లి ఆ ట్వీట్ ను టాగ్ చేస్తూ యానిమల్ సినిమా 817 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అలా చేయడంతో ఒక నెటిజన్ క్రిటిసిజం కూడా తీసుకోవాలంటే తీసుకున్నాం, ఇప్పుడు దాన్ని వెనక్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. నిజానికి సందీప్ రెడ్డి కబీర్ సింగ్ సినిమా చేస్తున్నప్పుడు ఇది వయలెంట్ సినిమా అంటూ విమర్శలు రాగా అసలైన వైలెన్స్ అంటే ఏంటో ఫ్యూచర్లో చూపిస్తానని చెప్పి ఈ యానిమల్ సినిమా చేశాడు. ఇప్పుడు కూడా ఈ విమర్శలు విని ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తాడో అని అభిమానులు ఆసక్తికరంగా కామెంట్ చేస్తున్నారు

Exit mobile version