సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ ని బీస్ట్ మోడ్ లో చూపిస్తూ తెరకెక్కించిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ సెకండ్ వీక్ లోకి సక్సస్ ఫుల్ గా ఎంటర్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇంత సౌండ్ చేసిన సినిమా ఇంకొకటి రిలీజ్ కాలేదు. A రేటెడ్ మూవీ అయినా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ అనిమల్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ ఇస్తుంది అనిమల్ మూవీ. క్రిటిక్ ప్రూఫ్ గా దూసుకెళ్తున్న అనిమల్ సినిమా 600 కోట్ల మార్క్ ని చేరింది. వరల్డ్ వైడ్ సాలిడ్ బుకింగ్స్ ని రాబడుతున్న అనిమల్ మూవీ ఎనిమిది రోజుల్లో 600 కోట్లు రాబట్టింది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. తెలుగులో కూడా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న అనిమల్ మూవీ రణబీర్ కపూర్ ని తెలుగు ఆడియన్స్ కి అడాప్టెడ్ సన్ గా మార్చేసింది.
The Blockbuster’s Triumph continues 🪓
Book your Tickets 🎟️ https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/F65Wrnn63c
— Animal The Film (@AnimalTheFilm) December 9, 2023
ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా అనిమల్ మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతుంది. కేవలం నార్త్ అమెరికాలోనే 10 మిలియన్ మార్క్ ని రీచ్ అయ్యిందంటే అనిమల్ మూవీ ర్యాంపేజ్ ఓవర్సీస్ లో ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే జోష్ ని మరో రెండు వారాల పాటు కొనసాగిస్తే అనిమల్ సినిమా 800 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టంగా కనిపించట్లేదు. డిసెంబర్ 21న డంకీ, 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అప్పటి నుంచి అనిమల్ మూవీ కంప్లీట్ గా స్లో అవ్వనుంది. ఈలోపు ఎంత కలెక్ట్ చేస్తుంది అనే దానిపైనే అనిమల్ ఫైనల్ కలెక్షన్స్ ఆధారపడి ఉన్నాయి.
