Site icon NTV Telugu

Anil Ravipudi: ఆ పని చేసి స్టేజిపైనే సుమను ఏడిపించిన డైరెక్టర్

Anil

Anil

‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. యూసగ్ఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వద్ద  అభిమానుల కోలాహలం మధ్య జరుగుతున్న ఈ ఈవెంట్ కు మహేష్ బాబు తో సినిమాలు తీసిన దర్శకులు అందరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని తెరకెక్కించిన అనిల్ రావిపూడి అతిధిగా విచ్చేసి స్టేజ్ పై నవ్వులు పూయించారు. ముఖ్యంగా తన ప్రశ్నలతో సుమకి చెమటలు పట్టించాడు. అంతేకాకుండా   ఈ వేదికపై సుమ స్పెషల్ ఏవి వేయించి ఆమె కంటతడి పెట్టేలా చేశారు. అయితే ఇందుకు సుమ ఆ పని చేసి స్టేజిపైనే సుమను ఏడిపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి’ అని యూట్యూబ్ లో థంబ్ నైల్ పెట్టండి రా అనడం నవ్వులు పూయించింది. ఇక ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. “సినిమా ట్రైలర్ చూశాక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా  ఈ సినిమా డైరెక్టర్ పరుశురామ్ కు బెస్ట్ విషెస్ తెలపాలనుకుంటున్నాను.

బ్రదర్ ఈ సినిమా కోసం మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను చూశాను. సో .. అంతకంటే పెద్ద హిట్ కొట్టాలి. ట్రైలర్, సోంగ్స్ అన్ని ప్రామిసింగ్ గా ఉన్నాయి. కీర్తి సురేష్ కు ఆల్ ది బెస్ట్.. థమన్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈరోజుల్లో సినిమా 50% సక్సెస్ మ్యూజిక్ తోనే తెలిసిపోతుంది. సూపర్ స్టార్ మహేష్ గారితో పనిచేయడం ఒక కిక్కు.. అది ఆయనతో పనిచేసిన ప్రతి డైరెక్టర్ కు ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత ఫ్రీడమ్ ఇస్తారు. అంత కిక్కు ఇస్తారు. మళ్లీ ఆయనతో ఎప్పుడెప్పుడు పనిచేయాలా అని ఉంది. ఈ సినిమా మీ కెరీర్ లో  బ్లాక్ బస్టర్ గా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. నా సినిమా చేసేటప్పుడు మహర్షి కన్నా ఎక్కువ హిట్ అవ్వాలని కోరుకున్నారు.. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను నా సినిమా కన్నా ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాలని కోరుకొంటున్నాను” అని చెప్పుకొచ్చారు.

Exit mobile version