అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Monday Test : కూలీ, వార్ 2కు నేటి నుండి అసలు పరీక్ష
ఈ సినిమాలో మెగాస్టార్ చిరు స్కూల్ లో పిల్లలకు ఆటలు నేర్పించే డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా ఈ సినిమా టైటిల్ లో తాజాగా ఓ టీవీ ఛానెల్ లో జరిగిన ఈవెంట్ లో మెగా డాటర్ కమ్ నిర్మాత సుస్మిత కొణిదెలతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా పాలొగొన్నాడు. ఈ ఈవెంట్ లో మెగా 157 టైటిల్ ను ‘ మన శంకరవరప్రసాద్ గారు’ అని చెప్పకనే చెప్పేసాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో శంకర వరప్రసాద్ అనే పాత్రలో చిరు కనిపించబోతున్నాడు అని, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాకు రిలీజ్ చేస్తాం అని తెలిపాడు. దాంతో పాటు మరో కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఈ నెల 22న మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేస్తామని తెలిపాడు. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
