Site icon NTV Telugu

Anil Ravipudi : “‘మధుపానం.. ధనాధన్’ ట్రెండ్: అనిల్ రావిపూడి కీలక విన్నపం!”

Anil Ravipudi

Anil Ravipudi

చిరంజీవి ”మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలోని “మధుపానం.. ధనాధన్” డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే, అయితే ఈ క్రేజ్‌ను చూసి మురిసిపోవాలా లేక ఆందోళన చెందాలా అన్న సందిగ్ధంలో ఉన్నామని అనిల్ రావిపూడి తన మనసులోని మాటను బయటపెట్టారు. చిరంజీవి ఆ డైలాగ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు, అయితే ఆ క్రేజ్‌ను కొందరు నెటిజన్లు, చిన్నారులతో కూడా అలాంటి రీల్స్ చేయించడం ఇబ్బందికరంగా మారింది. దీనిపై అనిల్ రావిపూడి స్పందిస్తూ మన శంకర్ వర ప్రసాద్ గారు (చిరంజీవి) ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరని, ఆయన సినిమాలోని డైలాగులను తప్పుడు మార్గంలో ప్రచారం చేయవద్దని కోరారు.

Also Read :Anil Ravipudi: వరుసగా 9 హిట్లు.. 10వ సినిమాపై అనిల్ రావిపూడి సెన్సేషనల్ అప్‌డేట్!”

సినిమా డైలాగులు పేలడం, అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం సహజం. కానీ, ఒక మద్యపానానికి సంబంధించిన డైలాగ్ చిన్న పిల్లల నోట రావడం, వారు ఆ బాటిళ్లతో రీల్స్ చేయడం అనేది కాస్త ఆలోచించాల్సిన విషయమని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. ఒక డైలాగ్ హిట్ అయినప్పుడు దాన్ని ఎంజాయ్ చేయడంలో తప్పులేదు. కానీ, అది సమాజానికి, ముఖ్యంగా చిన్నారులకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదు, “మందు బాటిళ్లతోనే రీల్స్ చేయాలా? టీ గ్లాసులతో చేయండి, కాఫీతో చేయండి.. తప్పులేదు. కానీ ఆల్కహాల్ జోలికి వెళ్లకండి” అని ఆయన సూచించారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ రకమైన వీడియోలు చూసి ప్రభావితం అవుతున్నారు అనేది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే కాకుండా, సామాజిక బాధ్యతతో అనిల్ రావిపూడి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Exit mobile version