Journalist Biopic: నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపర్చిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. సామాన్య ప్రజల పక్షాన నిలిచి, రజాకార్ల దారుణ దమనకాండను ఖండించి, భారతదేశంలో నిజాం సంస్థానం విలీనానికి కృషి చేసిన వ్యక్తి. షోయబుల్లా ఖాన్ రచనలను సహించలేని రజాకర్లు అతి దారుణంగా ఆయన్ని హతమార్చారు. 1948 నాటి వాస్తవిక సంఘటన ఆధారంగా ఆ పాత్రికేయుని సాహసగాథను ‘షహీద్ షోయబుల్లా ఖాన్’ పేరుతో తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ సమర్పణలో శీలం లింగారెడ్డి సినిమాగా తీస్తున్నారు. దీనికి వి.ఆర్.టి. దీపక్ రచన చేసి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా టీజర్ ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దీపక్ తో పాటు శ్రీనివాస్ రాజలింగం మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. చిన్నికృష్ణ సంగీతం అందించారు. దీపక్, మధుబాల, మిథున్ చక్రవర్తి, అలీ, నాజర్, మురళీధర్ గౌడ్, భరత్, రాజశేఖర్, బోస్, శోభన, కిషన్ రావు, కనకాల రమేశ్, నరసింహ, అజామ్, సి. దయానంద్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ ఆవిష్కరణలో నట శిక్షకుడు, ఈ సినిమాలో రజాకార్ ఖాసిం రజ్వీ పాత్రధారి అడ్ల సతీశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
https://www.youtube.com/watch?v=I6VGmziREak
