Site icon NTV Telugu

Shilpa Shetty : మరో వివాదంలో బాలీవుడ్ బ్యూటీ ఫ్యామిలీ

Shilpa-Shetty

బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి వరుస వివాదాలతో సతమతమవుతోంది. తాజాగా శిల్పాశెట్టి కుటుంబం మరో కాంట్రవర్సీలో చిక్కుకుంది. శిల్పాశెట్టి కుంద్రా, ఆమె సోదరి షమిత, వారి తల్లి సునందలకు అంధేరీ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. ఫిబ్రవరి 28న ముగ్గురూ తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే…

Read Also : SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్

ఓ వ్యాపారవేత్త ఈ ముగ్గురూ తన దగ్గర తీసుకున్న రూ. 21 లక్షల రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని ఆరోపించారు. పర్హాద్ అమ్రా అనే వ్యాపారవేత్త శిల్పాశెట్టి, షమిత, సునందలు 21 లక్షల రూపాయల రుణాన్ని తిరిగి చెల్లించలేదని జుహు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, శుక్రవారం ఈ కుటుంబం సమన్లు అందుకోవాల్సి వచ్చింది. ఫిర్యాదు ప్రకారం 2015లో శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి ఈ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నారని ఆటోమొబైల్ ఏజెన్సీ యజమాని పర్హాద్ అమ్రా వాదించారు. ఆరోపించిన మొత్తాన్ని జనవరి 2017 నాటికి తిరిగి చెల్లించాల్సి ఉంది. అయితే సురేంద్ర శెట్టి చనిపోగా, ఈ ముగ్గురు అప్పును తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తున్నారు.

కాగా గత ఏడాది జూన్‌లో తన భర్త రాజ్‌కుంద్రా అరెస్టు కారణంగా శిల్పాశెట్టి కుంద్రా కూడా వార్తల్లో నిలిచింది. మొబైల్ యాప్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఉత్పత్తి చేసి పంపిణీ చేసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, అసభ్యకరమైన మహిళల ప్రాతినిధ్యం (నిషేధం) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. సెప్టెంబర్‌లో కుంద్రాకు బెయిల్‌ మంజూరైంది. ఇక ఆ తరువాత కుంద్రా తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ఖండించాడు.

Exit mobile version