Nandamuri Sisters:నందమూరి తారక రామారావు.. ఆయన సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నందమూరి కుమారులందరిని ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. కానీ, నందమూరి ఆడపడుచులను ఎప్పుడైనా చూసారా.. అరే ఒక్కొక్కరిగా కాదు అందరిని ఒకేచోట.. చాలా రేర్ గా అక్కచెల్లెళ్లు కలిసి కనిపిస్తారు. ఇప్పటివరకు వీరందరూ కలిసి ఒకే ఫ్రేమ్ లో మీడియా కంట కనిపించలేదు అంటే అతిశయోక్తి కాదు. ఎన్టీఆర్ కు మొత్తం నలుగురు కుమార్తెలు.. భువనేశ్వరి, పురంధేశ్వరి, లోకేశ్వరి, ఉమా మహేశ్వరి.. ఇక చివరి అమ్మాయి ఉమా మహేశ్వరీ గతేడాది ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన విషయం తెల్సిందే. ఇక మిగతా ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరి పనుల్లో వారు తీరిక లేకుండా ఉన్నారు.
Aswani Dutt: రోషన్ ను ‘ఛాంపియన్’ చేస్తానంటున్న సీనియర్ నిర్మాత!
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భార్యగా భువనేశ్వరి .. తన బిజినెస్ లు చూసుకొంటుంది. దగ్గుబాటి పురంధేశ్వరి.. తండ్రిలానే రాజకీయాల్లో రాణిస్తోంది. ఇక మూడో కుమార్తె లోకేశ్వరి డాక్టర్ గా స్థిరపడింది. ఈ ముగ్గురు అక్కాచెలెళ్ళు ఒక ఫంక్షన్ లో దర్శనమిచ్చారు. ముగ్గురు పక్కపక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.ఇక కొంతమంది ఉమా మహేశ్వరీ కూడా ఈ ఫ్రేమ్ లో ఉంటే బావుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రాజకీయ, కుటుంబ విబేధాల వలన వీరి కుటుంబాలు విడిపోయాయని టాక్ ఉంది. అందుకే వీరెప్పుడు ఇలా కలిసి కనిపించరు. కానీ, ఇప్పుడిప్పుడే వీరు అందరు కలిసి ఉంటున్నట్లు సమాచారం. దీంతో రాజకీయాలు అన్ని పక్కన పెడితే మీరు అక్కా చెల్లెళ్ళు.. ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అభిమానులుగా మేము కోరుకుంటున్నామని అభిమానులు చెప్పుకొస్తున్నారు.