Site icon NTV Telugu

Varshini: అడుక్కునే అమ్మాయి చేతికి కూడా నెయిల్ ఆర్ట్.. వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు

Anchor Varshini

Anchor Varshini

Anchor Varshini Comments on Nail Art: తెలుగులో అతి తక్కువ కాలంలో మంచి పేరు సంపాదించిన వారిలో యాంకర్ వర్షిణి కూడా ఒకరు. తాజాగా ఆమె కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అసలు విషయం ఏమిటంటే సెలూన్ రంగంలో మంచి పేరు సంపాదించిన న్యాచురల్స్ అనుబంధ బ్రాండ్ నెయిల్స్ N బియాండ్ కొత్త బ్రాంచ్ హైదరాబాద్ కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ లో రెండో ఫ్లోర్ లో ఓపెనింగ్ అయింది. దీనిని యాంకర్ వర్షిణి చేతుల మీదుగానే ఓపెనింగ్ చేయించారు. ఈ సందర్బంగా ఆమె నెయిల్ ఆర్ట్ ను వేసుకుని మురిసిపోయారు.

అమ్మాయిలందరి ఫేవరేట్ గా నెయిల్స్ N బియాండ్ నిలుస్తుందని వర్షిణి మాట్లాడుతూ తాను ఓ సారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక అమ్మాయి చేతిలో ప్లకార్డ్ పట్టుకుని యాచిస్తూ ఉందని, కానీ ఆ అమ్మాయి చేతి వేళ్ళకు కూడా నెయిల్ ఆర్ట్ ఉండడం చూసి ఆశ్చర్యపోయానని చెప్పింది. ప్రస్తుతం నెయిల్ ఆర్ట్ షాప్స్ ప్రతి గల్లీలోనూ ఉన్నాయని, ఇప్పుడు ఇది బాగా డిమాండ్ ఉన్న బిజినెస్ అని కూడా వర్షిణి అభిప్రాయపడ్డారు. మహిళలకు అందం విషయంలో స్కిన్, హెయిర్ ఎంత ముఖ్యమో చేతి గోళ్లు కూడా అంతే ముఖ్యం అని నెయిల్ ఆర్ట్ విషయంలో మగువలు ఎంతో శ్రద్ధ కనబరుస్తారని అన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం నెయిల్స్ N బియాండ్ ఎన్నో రకాల వైవిధ్యమైన నెయిల్ ఆర్ట్ ఉత్పత్తులను, నెయిల్ ఆర్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఆమె కామెంట్ చేసింది.

Exit mobile version