Site icon NTV Telugu

Anchor Shyamala: పవన్‌లో ఆయాసం, ఆవేశమే చూశా… యాంకర్‌ శ్యామల షాకింగ్‌ కామెంట్స్!

Anchor Shyamala Rave Party Video

Anchor Shyamala Rave Party Video

Anchor Shyamala Sensational Comments on Pawan Kalyan: మరికొన్ని గంటల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల మీదే తెలుగు రాష్ట్రాల ప్రజల ఫోకస్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, వైయస్ జగన్, చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లు పోటీ చేసిన స్థానాల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ సమయంలో యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలంటే ఆవేశం కాదు, రాజకీయాలు అంటే అరవడం కాదు., రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నా భావన.

Hema: డ్రగ్స్‌ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ.

కానీ పవన్ కళ్యాణ్ లో నేను ఇప్పటివరకు అలాంటివి ఏవి చూడలేదు కేవలం పవన్ ఆవేశపడటం అరవడం మాత్రమే చూశాను, ఆయాస పడడమే చూశాను. ఆయన సాయం చేయడం తాను ఇప్పటివరకు చూడలేదని యాంకర్ శ్యామల కామెంట్ చేసింది. పిఠాపురంలో వంగా గీతక్క గెలుస్తుందని జూన్ 4వ తేదీన మీకే తెలుస్తుంది సర్వేలు మాత్రమే పవన్ కళ్యాణ్ గెలుస్తాయని చెబుతున్నాయి. కానీ అదేమీ రిజల్ట్ కాదు కదా అని కామెంట్ చేసింది శ్యామల. ఇక శ్యామల కామెంట్స్ మీద వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా పవన్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆమె స్థాయికి మించిన మాటలు మాట్లాడుతోంది అంటూ ఆమె మీద విరుచుకుపడుతున్నారు.

Exit mobile version