NTV Telugu Site icon

ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు.. చాలా అన్యాయం అన్న అంటూ యాంకర్ శ్యామల వీడియో

Anchor Shyamala Video

Anchor Shyamala Video

Anchor Shyamala Reacts on AP Election Results: 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలను విమర్శించిన యాంకర్ శ్యామల అనూహ్యంగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. కూటమి భారీ మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో శ్యామలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపద్యంలో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే. ఎన్నికల్లో ప్రజల తీర్పుని స్వాగతిస్తున్నాను కచ్చితంగా క్షేత్రస్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఈ ప్రజా తీర్పుని స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ముందుగా అఖండ విజయాన్ని మూటగట్టుకున్న కూటమికి ధన్యవాదాలు.

Rakshana Review: పాయల్ రాజ్ పుత్ రక్షణ రివ్యూ

పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బిజెపి సభ్యులకు, పురందేశ్వరి గారికి అందరికీ కూడా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి వైసీపీ కూడా మొత్తానికి కూడా పేరుపేరునా పేరుపేరునా ధన్యవాదాలు. ఎస్ ఓడిపోయాము, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గెలిచిన నాడు ఏ రోజు విర్ర వీగ లేదు. విజయగర్వంతో ఓడిపోయిన నాడు, ఏనాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మరింత బలాన్ని పుంజుకొని మళ్లీ ఖచ్చితంగా మీ అందరి సపోర్టుతో మనందరం కలిసి జగనన్నతో నడిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి ప్రభుత్వంగా మన ఏర్పడతాము. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ ఎస్ ఎప్పటికీ జగనన్నతోనే కలిసి నడుద్దాం, పనిచేద్దాం. ఏదైనా ప్రజలకు మంచి జరగడమే ముఖ్యం. ఈ ఐదేళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి జరగాలో అంత మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

నన్ను భయపెడుతూ చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా బెదిరిస్తున్నారు. ఒక రకమైన భయంగానే ఉంది, నాకు కూడా కానీ ఒకటే చెప్పాలి నేను. మీకు ఒకటి నచ్చుతుంది నాకు ఒకటి నచ్చుతుంది. అలా అని చెప్పి మీకు నచ్చనిది నాకు నచ్చింది అని చెప్పి మీరు బతకడానికి వీలు లేదంటే ఇది చాలా అన్యాయం అన్న. సో ప్లీజ్ దయచేసి ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నేను వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయలేదు చేయను కూడా ఎప్పటికీ. నాకు చాలా గౌరవం వ్యక్తిగత విమర్శలు నేను ఎప్పుడూ చేయలేదు, చేయను కూడా. దయచేసి మీరు కూడా అలాగే ఉండండి. ఒక పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఎంత చేయాలో అంత చేశాను. ఉన్నదే చెప్పాను లేనిది ఎక్కడా మాట్లాడలేదు దయచేసి దాన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అంటూ ఆమె చెప్పుకొచ్చింది.