Site icon NTV Telugu

వాడు అంతగా దిగజారి ఆ పని చేశాడు.. యాంకర్ రష్మీ ఆవేదన

యాంకర్ రష్మీ జంతు ప్రేమికురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో మూగ జీవాల కోసం ఆమె పడిన తపన చెప్పలేనిది. ఇక ఎక్కడైన మూగ జీవాలను హింసిస్తే రష్మీ కోపంతో రగిలిపోతుంటుంది. తాజాగా ఆమె మరోసారి జంతువులను హింసించేవారిపై ఫైర్ అయ్యింది. ఒక కుక్కను ఒక వ్యక్తి హింసిస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ “ఈ వ్యక్తికి మానవత్వం ఉందా..? మానవత్వాన్ని మరిచి ఇంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు రష్మీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటివారు ఇంకా సమాజంలో ఉండడం సిగ్గుచేటు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version