Site icon NTV Telugu

Anchor Jhansi: నన్ను ఎంతోమంది మోసం చేశారు.. వారిపై కక్ష

Jhansi

Jhansi

Anchor Jhansi: యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయభాను తరువాత యాంకర్ గా పేరు తెచ్చుకుంది ఝాన్సీ మాత్రమే. సుమ సైతం ఆమె తరువాతే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం యాంకరింగ్ కు స్వస్తి పలికి నటిగా పేరు తెచ్చుకుంది ఝాన్సీ. స్టార్ హీరో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించి మెప్పిస్తుంది. ఇక ఝాన్సీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జోగినాయుడుకు పెళ్లైన ఏడాదిలోపే విడాకులు ఇచ్చేసింది. తన బిడ్డ ధన్యతో కలిసి ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది. ఇప్పటివరకు తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడు బయటపెట్టని ఝాన్సీ.. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని వివరించింది. తనకు పొగరు ఉందని, అస్సలు మాట్లాడనని ఇండస్ట్రీలో టాక్ ఉందని, అయితే అదంతా నిజం కాదని ఆమె చెప్పుకొచ్చింది. డబ్బుల విషయంలో, అవకాశాల విషయంలో తనను ఎంతోమంది మోసం చేశారని చెప్పుకొచ్చింది.

Anasuya: తప్పు చేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టిన అనసూయ

“నాకు పోగరు, యాటిట్యూడ్, ఇగో ఉన్నాయని ఇండస్ట్రీలో చెప్పుకొస్తారు.. కానీ, నేను ఏంటి అనేది నాతొ ఉన్నవారికి మాత్రమే తెలుసు. నిజం చెప్పాలంటే.. నన్ను అర్ధం చేసుకున్నవారు నన్ను వదిలి వెళ్ళాలి అనుకోరు.. ఇక అర్ధం చేసుకున్నవాళ్ళు నాతో ఎక్కువ కాలం ప్రయాణించాలని కోరుకోరు. అందుకే మా పెళ్లి బంధం 13 నెలల వరకే ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. నేను చాలా చేదు అనుభవాలను చవిచూశాను. యాంకరింగ్ కు పిలిచేవారు కానీ, డబ్బులు ఇచ్చేవారు కాదు. కొన్నిసార్లు క్రెడిట్ ను మొత్తం వాళ్ళే కొట్టేసేవారు. 99 ఎపిసోడ్ లు నేనుచేస్తే 100 వ ఎపిసోడ్ కు వేరేవారు వచ్చి ఆ క్రెడిట్ ను వాళ్ళు అందుకొనేవారు. ఇలా నన్ను ఎంతోమంది మోసం చేశారు. అలా అని వారి మీద కక్ష పెంచుకొని పగ తీర్చుకోవాలని అనుకోవడం లేదు. అది పిచ్చితనమో.. మంచితనమో నాకు తెలియదు. ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఝాన్సీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version