ప్రముఖ యాంకర్ గాయత్రి ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. సోషల్ మీడియాకు ఆమడ దూరంగానే ఉండే గాయత్రి ఫేస్ బుక్ ను హ్యాక్ చేశారు కొందరు కేటుగాళ్లు. అనంతరం ఆ అకౌంటర్ ద్వారా వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకర సందేశాలు షేర్ చేశారు. అయితే.. అభ్యంతరకర పోస్టులు పెట్టగానే… అలర్ట్ అయిన యాంకర్ గాయత్రి… తన ఫేస్ బుక్ ఖాతా ను ఎవరో హ్యాక్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే… ఈ కేసు పై సిటీ సైబర్ క్రైమ్స్ ఏసిపి కెవిఎం ప్రసాద్ స్పందిస్తూ…తన ఫేస్ బుక్ లో ఇతర మతాలకు చెందిన అభ్యంతర కరమైన పోస్టింగులు పెడుతున్నారని యాంకర్ గాయత్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గాయత్రి అఫీషియల్ ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేయడమే కాకుండా, ఆమె పేరు పై మరో అకౌంట్ ను క్రియేట్ చేసినట్లు గుర్తించామని ఏసీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అభ్యంతరకర పోస్ట్‌లు : పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్
