NTV Telugu Site icon

Anchor Anasuya: ఆ ఊబిలో చిక్కుకోలేకే.. జబర్దస్త్ నుంచి బయటకొచ్చా

Anasuya About Leaving Jabar

Anasuya About Leaving Jabar

Anchor Anasuya Reveals Real Reason Behind Leaving Jabardasth Comedy Show: ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ పుణ్యమా అని యాంకర్ అనసూయకు ఎంతో పాపులారిటీ వచ్చిపడింది. ఈరోజు ఆమె ఇంత స్టార్డమ్‌ని అనుభవిస్తోందంటే.. అది జబర్దస్త్ షో వల్లేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కార్యక్రమానికి ఇప్పుడు అనసూయ గుడ్‌బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ షో నుంచి బయటకొచ్చినప్పుడు.. ఇతర షూటింగ్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేకే తప్పుకున్నానని అనసూయ చెప్పింది. కానీ, ఆ సమాధానంలో పూర్తి స్పష్టత లేకపోయేసరికి, అనసూయ ఏదో దాస్తోందని, అసలు కారణం అది కాదంటూ ప్రచారం మొదలైంది. ఆ షో నుంచి నాగబాబు, రోజాలతో పాటు ఇతర కీలక కంటెస్టంట్లు తప్పుకోవడం వల్లే.. అనసూయ కూడా బయటకొచ్చిందన్న టాక్ ఊపందుకుంది.

అయితే.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని తోసిపుచ్చిన అనసూయ, అసలు కారణం రివీల్ చేసింది. షోలో భాగంగా తనపై వేసే పంచ్‌లు నచ్చడం లేదని ఆమె తెలిపింది. పంచ్‌లు నచ్చక ఎన్నో సందర్భాల్లో ముఖం మాడ్చుకున్నానని, కానీ అవేవీ షోలో కనిపించవని పేర్కొంది. తనకు బాడీ షేమింగ్, వెకిలి చేష్టలు ఏమాత్రం నచ్చవని చెప్పింది. కానీ.. క్రియేటివ్ ఫీల్డ్‌లో అలాంటివి తప్పవని నిట్టూర్చిన అనసూయ, అదే ఊబిలో తాను చిక్కుకుపోవాలని అనుకోవడం లేదని వెల్లడించింది. ఆ షో నుంచి తప్పుకోవడానికి రెండేళ్లుగా అనుకుంటున్నానని, ఇప్పటికీ అది కుదిరిందని స్పష్టతనిచ్చింది. అంతే తప్ప.. నాగబాబు, రోజా వెళ్లిపోయారన్న కారణంతో తాను బయటకు రాలేదని చెప్పింది. తనకు జబర్దస్త్ షో అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఈ యాంకరమ్మ.. తాను నటనపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని, సినిమాల్లో నటన కారణంగానే జబర్దస్త్‌కు సమయం కుదరడం లేదని చెప్పుకొచ్చింది.

Show comments