NTV Telugu Site icon

‘ఫ్లాష్ బ్యాక్’ డబ్బింగ్ మొదలెట్టిన అనసూయ!

ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై నిర్మించిన ఈ ద్విభాషా చిత్రానికి డాన్ శ్యాండీ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ. ఎన్. బాలాజీ ఈ సినిమా తెలుగు వర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ‘అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై దర్శకుడు ఆవిష్కరించాడని, ఈ సినిమాలో చూపించే ప్రతి సన్నివేశం సగటు ప్రేక్షకుడి మదిలో ఎప్పటికీ నిలిచిపోతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఈ మూవీని రూపొందించామ’ని నిర్మాతలు చెబుతున్నారు.

ఇందులో రెజీనా ఆంగ్లో ఇండియన్ టీచర్‌గా విలక్షణ పాత్ర పోషిస్తుండగా, అనసూయ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ‘ఈ ఇద్దరి పాత్రలూ సినిమాలో మేజర్ అట్రాక్షన్ గా ఉంటాయని, ప్రభుదేవా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంద’ని దర్శకనిర్మాతలు చెప్పారు. శ్యామ్ సి.ఎస్. అందించిన బాణీలు, నేపథ్య సంగీతం మూవీకి మరో అసెట్ అని అన్నారు. గత కొంతకాలంగా రిచ్ లొకేషన్స్‌లో షూటింగ్ జరిపిన చిత్ర యూనిట్, ఇటీవల పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ను ఆరంభించింది. ఇందులో భాగంగా మొదట అనసూయతో డబ్బింగ్ ను మొదలు పెట్టారు. నందు దుర్లపాటి ఈ సినిమాకు మాటలు రాశారు. సరికొత్త పాయిట్‌తో రూపుదిద్దుకుంటున్న ‘ఫ్లాష్ బ్యాక్’ విజయంపై దర్శక నిర్మాతలు ధీమాగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.