మాస్ మహారాజా, రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం సాయంత్రం గ్రాండ్‌గా నిర్వహించారు. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో భాగంగా మాట్లాడుతూ స్టార్ యాంకర్ అనసూయ ఓ సీక్రెట్ ను రివీల్ చేసేసింది. ఫుల్ కిక్ అంటూ తన అభిమానులను ఊరించింది. ‘మై ఫస్ట్ బిగ్ సాంగ్’ అంటూనే దాన్ని ఇప్పుడు రివీల్ చేయాలనుకోట్లేదు అని చెప్పేసింది అనసూయ. కానీ స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా ఫుల్ కిక్ వస్తుంది అంటూ తన క్యారెక్టర్ పేరు చంద్రకళ అని రివీల్ చేసేసింది.
Read Also : Khiladi కాంట్రవర్సీ రూమర్స్… ఫుల్ స్టాప్ పెట్టేసిన నిర్మాత
