Site icon NTV Telugu

Anasuya: అన్నను తిట్టి.. తమ్ముడిని పొగిడేస్తున్నావ్.. ఏంటి కథ..?

Anu

Anu

Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తనను ఆంటీ అని పిలిచినందుకు చేసిన రచ్చతో నెటిజన్స్.. ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ నే క్రియేట్ చేశారు. ఇక ఆ ఆంటీ వివాదం ముగియనే లేదు.. విజయ్ దేవరకొండ మీద విరుచుకుపడింది అనసూయ. ది అనే పేరుతో విజయ్ ను ట్రోల్ చేసింది. విజయ్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? అమ్మడిని ఏకిపారేశారు. ది ఆంటీ అంటూ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక ఈ మధ్యనే ఈ వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. అయినా నెటిజన్స్ అప్పుడప్పుడు అనసూయ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే సడెన్ గా అనసూయ ప్లేట్ మార్చింది. ఏమైందో ఏమో కానీ, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాను ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది.

Miss. Shetty Mr. Polishetty: అబ్బ.. అబ్బ.. స్వీటీని ఇలా చూసి ఎన్నిరోజులు అవుతుందో

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధానపాత్రలుగా నటించిన చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఇక ఈ ట్రైలర్ ను అనసూయ షేర్ చేస్తూ చిత్ర బృందానికి విషెస్ చెప్పింది. “పార్టీకి చాలా ఆలస్యమైంది.. కానీ ఎప్పుడు ఉండేంత కాదు.. లవ్ లవ్ లవ్ లవ్ యూ.. హార్డ్ హిట్టింగ్ లైన్స్ తో ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. నాకు తెలిసిన వాళ్ళ కథలానే అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఎదురుచూడలేకపోతున్నా.. మిమ్మల్ని చూసి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను సాయి రాజేష్ గారు.. విరాజ్ చాలా కూల్ గా కనిపించవు .. ఆనంద్ దేవరకొండ చాలా ఇంటెన్స్ చూపించాడు” అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇదేంటి అన్నను తిట్టి.. తమ్ముడిని పొగిడేస్తున్నావ్.. ఏంటి కథ..? అనసూయ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version