Site icon NTV Telugu

Anasuya: మరో పాన్ ఇండియా సినిమాలో హాట్ యాంకర్..

Anasuya

Anasuya

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఒకపక్క షోలలో మెరుస్తూనే ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోల చిత్రంలో కీలక పాత్రలను కొట్టేసి మంచి గుర్తింపు తెచ్చుకొంటుంది. పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో అదరగొట్టిన అనసూయ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఆఫర్ అందుకొని బంఫర్ ఆఫర్ పట్టేసింది. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో పాన్ ఇండియా మూవీలో ఛాన్సు కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ వాసు మీనన్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక ఇటీవలే రిలీజ్ అయినా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో అనసూయ ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్నీ నేడు అనసూయ బర్త్ డే సందర్భంగా రివీల్ చేస్తూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమాలో అనసూయ మంచి రోల్ లోనే కనిపించనున్నదని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడు మరో హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.

Exit mobile version