NTV Telugu Site icon

Anasuya: ఓ.. ఆంటీ.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే.. మీడియా.. అది మర్చిపోకు

Anu

Anu

Anasuya: హాట్ యాంకర్ అనసూయ గురించి, సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చిన అంశం గురించి పోరాటం చేయడంలో తప్పులేదు. కానీ, ఒక హీరో, అతని ఫ్యాన్స్ తనని ఒక ఈవెంట్ లో అవమానించారన్న అక్కసుతో ఆమె సమయం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాను ఒక వేదికగా వాడుకుంటూ.. అభిమానులను రెచ్చగొడుతుంది అని నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు నిజం మాట్లాడుకోవాలంటే.. ఈ మొత్తం వివాదానికి ఆజ్యం పోసింది అనసూయనే అని చెప్పుకొస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను విమర్శించినవారు చాలామంది ఉన్నారు. అందులో అనసూయ ఒకరు. ఆ విమర్శించిన వారిని విజయ్ దేవరకొండ అభిమానులు ట్రోల్ చేశారు. అది అక్కడితో ఆగిపోయింది. కానీ, అనసూయ మాత్రం సమయం వచ్చినప్పుడల్లా.. విజయ్ పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. అతడు ఏది చేసినా.. ఏదో ఒక విధంగా ట్రోల్ చేసి ట్వీట్ చేయడం, దానిపై విజయ్ ఫ్యాన్స్ మండిపడడం జరుగుతూనే ఉంది. ఇక ఈసారి మరింత రెచ్చిపోయింది అనసూయ.

ఒక నార్మల్ పేరు ముందు THE అని యాడ్ చేసినందుకు.. THE అంట.. పైత్యం అని ఒక్క ట్వీట్ వేసింది. ఇక దాంతో విజయ్ ఫ్యాన్స్ అసెంబుల్ అయ్యారు.. ఆంటీ వివాదమే ఇంకా ముగిసిపోలేదు.. అప్పుడే ది వివాదంతో వచ్చేసావా అంటూ ఆ రెండిటిని కలిపి ది ఆంటీ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయినా అనసూయ ఆగకుండా వారిని రెచ్చగొడుతూనే ఉంది. వారు ఎంత ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారో.. అంతకన్నా ఎక్కువగా కౌంటర్లు ఇస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ వివాదంలోకి కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఎంటర్ అయ్యాడు. అది వేరే విషయం. ఇక ట్విట్టర్ లో జరుగుతున్న వార్ గురించి మీడియా రాసిందని.. తాజాగా అనసూయ మీడియాపై ఫైర్ అయ్యింది. మీడియాపై కొంచెం ఎక్కువగానే నోరు పారేసుకుంది. ఉప్పూకారం తింటే నిజాలు రాయండి.. దమ్మూ ధైర్యం ఉంటే.. ఇలాంటివి రాయండి అంటూ రెచ్చిపోయింది.

ఇక అంతే కాకుండా ” మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్ళు, ఫేమస్ అయితే ఫేమస్ అయినవాళ్లు.. వాళ్ళ మీదే రాస్తూ పొట్ట నింపుకొనేవాళ్ళ కోసం చెప్తున్నాను.. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయను వేసుకున్నారు.. ఆ హీరో ఫ్యాన్స్ అనసూయను ఏడిపిస్తున్నారు.. వంటపడ్డారు.. ట్రోల్ చేశారు.. కాదు.. మీకు ఇంకా దునియా దారి తెలియదు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు.. అన్నవాడి నోరు కంపు. మీకు దైర్యం ఉంటే.. ఉప్పుకారాలు తిని ఉంటే.. నిజం రాయండి. నేను దైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. చేతకాని వాళ్ళు అదుపు తప్పారు.. ఇది రాయాల్సింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.. మీడియాను కూడా ఈ రేంజ్ లో అంటున్నావ్.. వాళ్లంటూ లేకపోతే నువ్వెక్కడ ఉన్నావ్.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే మీడియా.. అలాంటివారిపై నోరు పారేసుకుంటున్నావ్.. చూసుకో అని కొందరు అంటుండగా.. అవును.. ఈమె.. దేనిమీద పోరాడుతుందని సపోర్ట్ చేయాలి.. ఏది రాయడానికి వారికి దమ్ము దైర్యం కావాలి. గొడవ మొదలు పెట్టింది ఆమె.. దాన్ని ట్రోల్ చేస్తుంది విజయ్ ఫాన్స్.. అందులో ఉన్న నిజం ఈమెనే మీడియా ముందుకు వెళ్లి చెప్పొచ్చుగా .. ఇలా డొంకతిరుగుడుగా ట్వీట్స్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అర్జున్ రెడ్డి గొడవ తరువాత కూడా అనసూయ, విజయ్ కలిసి ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇవన్నీ ఫేమస్ కావడానికి ఆమె వేస్తున్న పబ్లిసిటీ స్టంట్స్ అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. జబర్దస్త్ లో, సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసిన సపోర్ట్ గా నిలుస్తున్న మీడియానే ఈ రేంజ్ లో అనడం తప్పు అనసూయ అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.

Show comments