Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఖాళీలేకుండా మారింది. ఇక వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కాగా, కొన్ని రోజులుగా అనసూయ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికి తెల్సిందే. ఆంటీ వివాదం, ది వివాదం తో అమ్మడు మరింత ఫేమస్ అయ్యింది. నెటిజన్లు ఎన్ని రకాలుగా ట్రోల్ చేసినా వాటిని పట్టించుకోకుండా తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతుంది. ఇక అనసూయ మొదటి నుంచి స్కిన్ షో చేయడంలో ముందు ఉంటుంది. ఒకప్పుడు జబర్దస్త్ లో చిట్టిపొట్టి బట్టలో దర్శనమిచ్చే అను.. ఇప్పుడు సోషల్ మీడియాలో అంతకుమించిఅందాల ఆరబోత చేస్తూ కవ్విస్తుంది. తాజాగా అనసూయ బికినీ ట్రీట్ ఇచ్చి అభిమానులను షేక్ చేసింది.
ఎండాకాలం వచ్చింది అంటే చాలు.. హీరోయిన్లు వెకేషన్స్ కోసం సముద్రపు ఒడ్డుకు చేరుకుంటారు. బికినీలతో అభిమానులకు ట్రీట్ ఇస్తారు. ఇక వారి జాబితాలోకి చేరింది.. అందాల ముద్దుగుమ్మ అనసూయ. తన కుటుంబంతో కలిసి ను ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ వెకేషన్ లో అనసూయ మొదటిసారి బికినీలో కనిపించింది. తన భర్త భరద్వాజ్.. మరియు పిల్లలతో స్విమింగ్ పూల్ లో జలకాలాడింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ ” ఈ సమ్మర్ లో ఏం చేస్తున్నారు” అంటూ క్రేజీ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ సూపర్ అని కొందరు అంటుండగా.. ఇంకొందరు మాత్రం అనసూయ డ్రెస్సింగ్ ను తప్పు పడుతున్నారు. ఇది అమెరికా కాదని, ఎదిగే పిల్లల ముందు .. తల్లిగా ఇలాంటి డ్రెస్ ల్లో కనిపించడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ కామెంట్స్ పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.
