NTV Telugu Site icon

Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?

Anasua Bharadwaj

Anasua Bharadwaj

Anasuya Bharadwaj Shares her Crying Video: ఎప్పుడూ చలాకీగా ఉంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అనసూయ గుక్క పెట్టి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఒక సుదీర్ఘ మెసేజ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో ఆమె షేర్ చేసిన విషయం యదాతధంగా మీకోసం. హలో!! మీరందరూ మంచి ఆరోగ్యంతో, మంచి ఉత్సాహంతో ఉన్నారని ఆశిస్తున్నాను, నా ఈ పోస్ట్‌ చూస్తున్న మీరందరూ చాలా గందరగోళానికి గురవుతారని నాకు తెలుసు. నిజానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ అనేవి నాకు తెలిసినంత వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి సృష్టించారు. అయితే సోషల్ మీడియాని మంచి ప్రదేశంగా మార్చడానికి, ఒకరికొకరు అండగా ఉండండి, సమాచారమందించే విషయాలను మాత్రమే పంచుకోండి. తెలియని వారి జీవనశైలి,సంస్కృతులను తెలుసుకోండి, ఆనందాన్ని పంచండి. ఈ రోజు వీటిలో ఏదైనా నిజంగా ఉన్నాయా అని అడిగితే లేవనే చెప్ఆపాలి. ఏది ఏమైనా.. ఈ పోస్ట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, సోషల్ మీడియాలో అన్ని పోజులు, ఫోటోషూట్‌లు, క్యాండిడ్స్.. చిరునవ్వులు.. నవ్వులు.. డాన్సులు.. బలమైన కౌంటర్లు, స్ట్రాంగ్ కం బ్యాక్ మొదలైనవి నా జీవితంలో ఒక భాగమే, మీరు కూడా నా జీవితంలో ఒక భాగమే కాబట్టి నేను అదంతా మీతో పంచుకుంటాను. అలాగే నా జీవితంలోని ఈ దశలో నేను అంత బలంగా లేను, బలహీనంగా ఉన్నాను, నాకు కూడా బ్రేక్ డౌన్స్ ఉంటాయి.

మనిషిగా పుట్టాక ఇవన్నీ తప్పవు అని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను న్యూట్రల్ ఆలోచనలు, డిప్లమసీ, డోంట్ కేర్ యాటిట్యూడ్ చూసి బలమైనదాన్ని అనుకునే దాన్ని. కానీ ఆ బలం నా బలం కాదు, నా అసలు బలం ఇక్కడే ఉంది. ఏడవాల్సి వస్తే ఏడ్చేసి ఒకటి రెండు రోజుల తర్వాత చిరునవ్వుతో ప్రపంచాన్ని ఎదుర్కోవాలి. ఇట్స్ ఓకే టు బీ నాట్ ఓకే కానీ, ఏది ముఖ్యమైనది అంటే రెస్ట్, రీబూట్ కానీ ఎప్పుడూ నిష్క్రమించవద్దు. నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా ఒకరు మీతో ఎలా ప్రవర్తించినా వారి పట్ల దయతో ఉండండి, అతను/ఆమెకు అది బ్యాడ్ డే అయి ఉండవచ్చు. కొంచెం సెట్ అయ్యాక వారే తిరిగి వస్తారు, నన్ను నమ్మండి ఈ విషయాన్ని నేను కష్టపడి నేర్చుకుంటున్నాను అని ఆమె రాసుకొచ్చారు. ఇక చివరిలో నేను ఇప్పుడు పూర్తిగా బాగున్నాను, ఇది నా బాడ్ డే గుర్తుంచుకోవడానికి నేను రికార్డ్ చేసిన మెమరీ నుండి.. 5 రోజుల క్రితం వీడియో అని ఆమె రాసుకొచ్చారు. అంటే ఫైనల్ గా ఆమె చెప్పింది ఏంటంటే ఏడవాలి అనిపిస్తే ఏడ్చి రెస్ట్ తీసుకుని మళ్ళీ మొదలు పెట్టండి అని ఆమె రాసుకొచ్చింది. అయితే ఆమెకు ఏం కష్టం వచ్చింది అనే విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు.

ఆ వీడియో మీరూ చూసేయండి.

Show comments