NTV Telugu Site icon

Anasuya Bharadwaj: నన్ను అందులోకి లాగకండి బాబోయ్!

Anasuya Bharadwaj Request

Anasuya Bharadwaj Request

Anasuya Bharadwaj request: యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనసూయ భరద్వాజ్ తరువాతి కాలంలో సుకుమార్ పుణ్యమా అని నటిగా మారింది. యాంకరింగ్ కంటే యాక్టింగ్ లో డబ్బుతో పాటు పేరు కూడా వస్తూ ఉండడంతో యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు నటన మీదే ఫోకస్ పెడుతోంది. ఇక ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ వ్యవహారంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విజ్ఞప్తి చేసింది. అందరికి నమస్కారం.. నేను ఒక అభ్యర్థన చేయవలసిన అవసరం ఉంది, కొన్ని రోజుల నుండి చాలా ట్వీట్లు నా దృష్టికి వస్తున్నాయి. రాజకీయ, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో ఇతరులను అగౌరవ పర్చడానికి నా పేరును పోలికగా ఉపయోగిస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్ర షెడ్యూల్ లో మార్పులు
నా పేరును కించపరిచే స్థాయిలో ఉపయోగించడం వల్ల ఇది నాకు కూడా అగౌరవంగా ఉందని ఆమె పేర్కొంది. ఈ విషయాలతో నాకు ఎక్కడా సంబంధం లేదు, నేను నా జీవితాన్ని నాకు మాత్రమే నచ్చిన విధంగా జీవించాలని అనుకుంటున్నారు. నేను ఎవరి జోలికి వెళ్లడం లేదు ఎందుకంటే అది నాకు అనవసరమైన బాధ కలిగించేలా ఉంటుందని నేను ఎన్నో కష్టాలు పడి తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ నేను మీ అందరిని అభ్యర్థిస్తున్నాను, నేను స్వయం నిర్మిత మహిళను, నేను ఈ మాట చెప్పినప్పుడు నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఏమైనా చేసినప్పుడు దాన్ని కవర్ చేయడానికి నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదని చెప్పుకొచ్చింది. మీరు నన్ను మెచ్చుకో లేకపోతే లేదా ప్రోత్సహించ లేకపోతే కనీసం నా నుండి దూరంగా ఉండండి, ఇందులో నాకు ఒక కుటుంబం ఉంది.. దయచేసి ఇక్కడితో వదిలేయండి అని ఆమె పేర్కొంది.

Show comments