NTV Telugu Site icon

Anasuya: బావగారిని వాడు వీడు అంటావేంట్రా.. చెప్పుతో కొడతా.. దొబ్బేయ్ ఇక్కడినుంచి

Untitled 1

Untitled 1

Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నటిగా మంచి అవకాశాలను అందుకుంటున్న అనసూయ.. ఈ మధ్యనే ఆంటీ వివాదంతో ఫేమస్ అయ్యింది.. తనను ఆంటీ అని పిలిచినవారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి షాక్ ఇచ్చింది. ఈ వివాదం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అనసూయ.. తన గురించి కానీ, ఆడపిల్లల గురించి కానీ ఎక్కువ తక్కువ మాట్లాడితే వారి అంతు చూసే వరకు వదలదు. ఇక తాజాగా మరోసారి అనసూయ కొత్త వివాదానికి తెరలేపింది. ఒక నెటిజెన్ తో కామెంట్స్ బాక్స్ లోనే వాగ్వాదానికి దిగింది. అసలు విషయమేంటంటే.. నిన్న ప్రేమికుల రోజు సందర్భంగా అనసూయ.. భర్త భరద్వాజ్ తో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ.. “నీతో జీవితం నాకు రోలర్ కాస్ట్ ఎక్కినట్లు ఉంటుంది.. హ్యాపీ వాలెంటెన్స్ డే .. సుశాంక్ భరద్వాజ్” అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ ఫోటోపై నెటిజెన్ల పలు విధాలుగా స్పందించారు. అందులో ఒక నెటిజెన్ మాత్రం.. “అదేం లేదు అక్కా.. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది అందుకే” అని కామెంట్ చేశాడు. ఇక ఈ కామెంట్ కు అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. అక్కా అనడంతో.. ఎంతో పద్దతిగా తమ్ముడు అని సంబోదిస్తూనే కౌంటర్ ఎటాక్ ఇచ్చింది.

“అదేంట్రా తమ్ముడు అంత మాట అనేశావ్.. ఎంతుంది ఏంటి డబ్బు.. చెప్పు.. నాకు లేదా ఏంటి డబ్బు..? మరి.. నీకు తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా అందా..? రేయ్ చెప్పరా బాబు.. అయినా బావగారిని వాడు వీడు అనొచ్చా..? ఇదేం పెంపకంరా నీది.. చెంపలేసుకో.. లేకపోతే నేను వేస్తా చెప్పుతో.. సారీ అదే చెంపదెబ్బలు ” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ మాటలకు సదురు నెటిజెన్ కూడా స్పందిస్తూ రియాలిటీనే చెప్పాను.. మీరు సమర్ధించుకోకండి అని రిప్లై ఇచ్చాడు.. దీంతో మరోసారి అనుసయ రెచ్చిపోయింది.. “నీ బొంద రా నీ బొంద.. మాట్లాడడం నేర్చుకో ఫస్ట్.. అంతర్యామిలా అన్ని తెలిసినట్లు బిల్డప్ ఒకటి.. నేను సమర్ధించుకుంటున్నాను అంటున్నావ్.. నా రియాలిటీ నీకేం తెలుసురా..? పస్కలొచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తోందట.. నీ బుద్ధి మనీ అయితే అందరిదీ అదే అనిపిస్తోంది.వీలయితే మారు.. తమ్ముడివి కదా మంచి చెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్య” అంటూ చెప్తూనే దొబ్బెయ్ ఇక్కడినుంచి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ మాటల యుద్ధం వాడివేడిగా సాగతోంది. మరి ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

Show comments