NTV Telugu Site icon

Anasuya: తప్పు చేస్తున్నారు.. విజయ్ ఫ్యాన్స్ ను మరింత రెచ్చగొట్టిన అనసూయ

Anu

Anu

Anasuya: గాలికి పోయే కంపను ఒంటికి తగిలించుకుంది అని పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు. ప్రస్తుతం అనసూయ వాలకం చూస్తుంటే అలాగే ఉంది. మూడు రోజులుగా విజయ్ దేవరకొండ ఫాన్స్ కు, అనసూయకు మధ్య ‘THE’ వివాదం జరుగుతున్న విషయం తెల్సిందే. విజయ దేవరకొండ పేరు ముందు ‘THE’ ఉండడం చూశానని, అదేం పైత్యమో .. మనకెందుకు అంటకుండా చూసుకుందామని ఒక ట్వీట్ చేసింది. ఇక అక్కడ నుంచి మొదలయ్యింది ఈ గొడవ. ఈ గొడవకు ఆజ్యం పోస్తూనే ఉంది అనసూయ. విజయ్ ఫ్యాన్స్ ను రెచ్చగొడుతూనే ఉంది. వారు ఎలాంటి ట్వీట్స్ చేసినా వాటిని షేర్ చేసి అందుకు తగ్గ కౌంటర్లు ఇస్తుంది. ఇక ఈ ‘THE’ వివాదంపై విజయ్ ఇప్పటివరకు స్పందించింది లేదు. ఇక తాజాగా మరోసారి అనసూయ.. తన ట్వీట్స్ తో రెచ్చిపోయింది. ‘తప్పు ఎప్పటికైనా తప్పే.. అది ఎంతమంది చేసినా.. ఒప్పు ఎప్పటికైనా ఒప్పే.. అది నువ్వొక్కడివి చేసినా’ అనే కోట్ ను షేర్ చేసి.. రౌడీ ఫ్యాన్స్ తప్పు చేస్తున్నారు అని చెప్పకనే చెప్పింది.

Vijay Devarakonda: ‘THE’ ని బ్రాండ్ ని చేసేసావ్ గా అనసూయ ఆంటీ..

అంతేకాకుండా ఇంకో ట్వీట్ లో ” అంటే ఇంతమంది వత్తాసు పలికితే కానీ, పనవ్వదన్నమాట. అతడు సినిమాలో బుజ్జిని పార్థు అడిగినట్టు ‘అదే .. ఇంతమంది ఏంటి.. అని, నా ఒక్కదానికోసం.. ఏమో బాబు.. నాకు ఈ పీఆర్ స్టంట్స్ తెలీవు, రావు, అవసరం లేదు కూడా.. కానియ్యండి. కానియ్యండి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ పై రౌడీ ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు. అటెన్షన్ కోసమే ఇలాంటి చేస్తున్నావా ఆంటీ అని కొందరు.. అతడి సినిమా రిలీజ్ అయ్యే టప్పుడే ఏదో ఒక వివాదంతో అతడి పేరు తీసుకొస్తావ్.. నువ్వు కూడాఆయన పీఆర్ అని అనిపిస్తూ ఉంటుంది అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

Show comments