NTV Telugu Site icon

Ananth Sriram: తమిళ్ హీరోల ముందే తెలుగు గొప్పతనం చెప్పి షాక్ ఇచ్చిన గీతరచయిత

As

As

Ananth Sriram: కోలీవుడ్ బాహుబలిగా తెరకెక్కింది పొన్నియన్ సెల్వన్. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కార్తీ, విక్రమ్, జయంరవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను తెలుగులో నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రమోషన్ల జోరును పెంచేసిన చిత్రబృందం నేడు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక ఈ వేదికపై గీత రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగు గొప్పతనం గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రెహమాన్ తో తాను చేసిన సాంగ్స్ గురించి అద్భుతంగా చెప్పాడు.

భూమి మీద జరిగిన చందమామ లాంటి కథను కళ్లారా చూడడానికి సిద్ధంగా ఉన్న తెలుగు వీరులందరికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా అంటూ తనదైన స్టైల్ లో మొదలుపెట్టిన అనంత్.. తన జీవితం రెహమాన్ మార్చేశారని, అప్పట్లో ఏ మాయ చేసావే ముందు, ఆ తరువాత అని చెప్పుకోవాడినని, ఆ తర్వాత తాను నేను సాంగ్ కు ముందు తరువాత అని చెప్పుకొనేవాడిని అని.. ఇప్పుడు పొన్నియన సెల్వన్ ముందు, తరువాత అని చెప్పుకొంటున్నట్లు తెలిపాడు. పొన్నియన్ సెల్వన్ అంటే కావేరి పుత్రుడని.. తాను మాత్రం గోదావరి పుత్రుడని చెప్పిన అనంత్ శ్రీరామ్.. కావేరి పుత్రుడు సినిమాలో అన్ని పాటలు రాయడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సాంగ్స్ అన్ని భాషల్లో కంటే తెలుగులో వినడానికి ఎక్కువ బావుందని చెప్తున్నారు.. అది తెలుగు భాషలో ఉన్న గొప్పతనమని, తెలుగు మాట్లాడడం, తెలుగు వినడం, తెలుగు రాయడం, ఒక్క జన్మలో చేసుకున్న పుణ్యం కాదని, ఇది జన్మజన్మల పుణ్యమని తెలిపాడు. రవీంద్రనాధ్ ఠాగూర్ అన్నట్లు ఇది సంగీతమా.. భాషా అన్నట్లు భాష గొప్పతనం వలనే ఈ సినిమాలో అన్ని సాంగ్స్అంత అద్భుతంగా వచ్చాయని తెలిపాడు. ఏదిఏమైనా తమిళ్ హీరోల ముందు తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పి అనంత్ శ్రీరామ్ షాకిచ్చాడని అంటున్నారు అభిమానులు.

Show comments