Site icon NTV Telugu

ఆసక్తి రేకెత్తిస్తున్న ‘హైవే’ కాన్సెప్ట్ పోస్టర్స్

ఇటీవ‌ల విడుదలైన ‘పుష్పక విమానం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో సైకో క్రైమ్‌ థ్రిల్లర్ ‘హైవే’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఇందులో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2 గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్’ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా, బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌లో ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా మూవీలోని ప్రధాన తారాగణంపై కాన్సెప్ట్ పోస్టర్స్ ను విడుదల చేశారు. దీని గురించి నిర్మాత వెంకట్ తలారి మాట్లాడుతూ,”సూప‌ర్‌హిట్ మూవీ ‘118’ను తెర‌కెక్కించిన గుహ‌న్ గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ దేవ‌ర‌కొండ, మాన‌స రాధా కృష్ణ‌న్ హీరో హీరోయిన్లుగా ‘హైవే’ చిత్రం రూపొందుతోంది. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెర‌కెక్కించాం. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు చివ‌రిదశ‌లో ఉన్నాయి” అని అన్నారు. ”ఒక‌రితో ఒక‌రికి సంభంధం లేని న‌లుగురు వ్య‌క్తుల క‌థ ఇదని, పూర్తిగా హైవే నేప‌థ్యంలోనే సాగే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌ అని, టెక్నిక‌ల్ ప‌రంగా హై స్టాండ‌ర్డ్‌లో ఉంటుంద’ని దర్శకుడు గుహన్ చెప్పారు.

Exit mobile version